అక్కడ.. రేపట్నుంచి ప్రైమరీ స్కూల్స్ మూసివేత
విధాత: ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రంగా పెరిగిపోవడంతో.. రేపట్నుంచి ప్రాథమిక పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. శనివారం నుంచి స్కూళ్లను మూసివేస్తున్నామని తెలిపారు. ఢిల్లీలో గాలి నాణ్యత పూర్తిగా పడిపోయినందు న, విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఐదు నుంచి 8వ తరగతి విద్యార్థులకు బహిరంగ ప్రదేశాల్లో క్రీడలు ఆడేందుకు అనుమతి లేదన్నారు. యాక్టివాలోకి దూరిన నాగుపాము.. ఈ వీడియో చూడాలంటే […]

విధాత: ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రంగా పెరిగిపోవడంతో.. రేపట్నుంచి ప్రాథమిక పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. శనివారం నుంచి స్కూళ్లను మూసివేస్తున్నామని తెలిపారు.
ఢిల్లీలో గాలి నాణ్యత పూర్తిగా పడిపోయినందు న, విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఐదు నుంచి 8వ తరగతి విద్యార్థులకు బహిరంగ ప్రదేశాల్లో క్రీడలు ఆడేందుకు అనుమతి లేదన్నారు.
యాక్టివాలోకి దూరిన నాగుపాము.. ఈ వీడియో చూడాలంటే ధైర్యం ఉండాల్సిందే..
పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తో కలిసి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ మీడియాతో మాట్లాడారు. వాయు కాలుష్యం అనేది నార్త్ ఇండియా సమస్య అని, వరి పంట వ్యర్ధాల్ని కాల్చివేయాలని రైతులు కూడా కోరుకోవడం లేదని, కానీ రెండు పంటల మధ్య తక్కువ సమయం ఉన్నందున వాళ్లకు మరో అవకాశం లేదని కేజ్రీ అన్నారు.
ఒకవేళ పంజాబ్లో పంటల వ్యర్ధాలను కాల్చివేస్తున్నారంటే దానికి మేమే బాధ్యులమని కేజ్రీవాల్ తెలిపారు. ఆ వ్యాఖ్యలను పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా అంగీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే వచ్చే ఏడాదిలోగా పంట వ్యర్ధాల కాల్చివేతపై నిర్ణయం తీసుకుంటామని, కాలుష్యం నివారణకు చర్యలు తీసుకుంటామని కేజ్రీవాల్ స్పష్టం చేశారు.
తమ ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు మాత్రమే అవుతుందన్నారు. ఈ సమస్యను ఎదుర్కోవడంలో మాఫియాలు అడ్డు వస్తున్నాయని, కానీ వచ్చే ఏడాదిలోగా దీనిపై సమగ్రమైన చర్యలు తీసుకుంటామ న్నారు. పంట మార్పిడికి చర్యలు తీసుకుంటామన్నారు.