స్వరాష్ట్రంలో వైద్య విద్యకు ప్రాధాన్యం: మంత్రి జగదీష్ రెడ్డి
విధాత: ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మెడికల్ విద్యకు పెద్ద పీట వేస్తూ విద్యార్థుల ఆకాంక్షల సాధనకు తోడ్పాటునిస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. నల్లగొండ పట్టణంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ వార్షికోత్సవ వేడుకలను శనివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. వైద్యరంగంలో 60 ఏళ్లలో సాధ్యంకాని అభివృద్ధి ఎనిమిదేళ్లలోనే కేసీఆర్ ప్రభుత్వం చేసి చూపిందన్నారు. జిల్లాకొక మెడికల్ కాలేజీ లక్ష్యం సాకారం దిశగా రాష్ట్రం వేగంగా అడుగులు వేస్తుందన్నారు. రాష్ట్రం ఏర్పడిన […]

విధాత: ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మెడికల్ విద్యకు పెద్ద పీట వేస్తూ విద్యార్థుల ఆకాంక్షల సాధనకు తోడ్పాటునిస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. నల్లగొండ పట్టణంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ వార్షికోత్సవ వేడుకలను శనివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు.
వైద్యరంగంలో 60 ఏళ్లలో సాధ్యంకాని అభివృద్ధి ఎనిమిదేళ్లలోనే కేసీఆర్ ప్రభుత్వం చేసి చూపిందన్నారు. జిల్లాకొక మెడికల్ కాలేజీ లక్ష్యం సాకారం దిశగా రాష్ట్రం వేగంగా అడుగులు వేస్తుందన్నారు. రాష్ట్రం ఏర్పడిన తొలిదశలోనే నల్లగొండ, సూర్యాపేట, సిద్దిపేట, మహబూబ్ నగర్‌లలో నాలుగు కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు.
ఈ 8 ఏళ్లలో 12 కొత్త వైద్య కళాశాల ప్రారంభించి తెలంగాణ ప్రభుత్వం వైద్య కళాశాల స్థాపనలో రికార్డు సృష్టించింది అన్నారు. సమైక్య రాష్ట్రంలో ఐదు మెడికల్ కాలేజీలు ఉంటే, నేడు స్వరాష్ట్రం తెలంగాణలో మెడికల్ కాలేజీల సంఖ్య 17కు పెరిగిందన్నారు. ఒక్క ఈ విద్యా సంవత్సరంలోనే 8 మెడికల్ కాలేజీలను ప్రారంభించుకోవడం దేశంలోనే అరుదైన రికార్డుగా నిలిచిందన్నారు.
వైద్య విద్య కోసం దేశాలు దాటి వెళ్లకుండా స్వరాష్ట్రంలోనే వైద్య విద్య అభ్యసించే అవకాశం ఏర్పడిందని అన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలలో గతంలో కన్నా మూడు రెట్లు పైగా సీట్లు పెరిగాయన్నారు. వచ్చే ఏడాది తొమ్మిది, తదుపరి ఏడాది మరో 8 మెడికల్ కాలేజీలు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందన్నారు.
కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు కొత్త మెడికల్ కాలేజీ ఒక్కటి ఇవ్వకపోయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య తెలంగాణ సాధనకు వైద్యవిద్యకు ప్రాధాన్యతనిస్తూ పనిచేస్తుందన్నారు. త్వరలోనే అన్ని మెడికల్ కళాశాలకు పూర్తిస్థాయి వసతులు కల్పించడం జరుగుతుందన్నారు.
స్వరాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లు 850 నుంచి 2790కి పెరిగాయని, పీజీ సీట్లు 531 నుంచి 1222కు, సూపర్ స్పెషాలిటీ 76 నుంచి 152వరకు పెరిగాయని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి,కాలేజీ ప్రిన్సిపాల్ పాల్గొన్నారు.