ప్రియాంక గాంధీ చేవెళ్ల పర్యటన రద్దు
ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ చేవెళ్ల పర్యటన రద్దయింది. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలలో భాగంగా రెండు గ్యారెంటీ పథకాలను ప్రియాంక గాంధీ ప్రారంభించాల్సి ఉంది

విధాత: ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ చేవెళ్ల పర్యటన రద్దయింది. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలలో భాగంగా రెండు గ్యారెంటీ పథకాలను ప్రియాంక గాంధీ ప్రారంభించాల్సి ఉంది. అయితే అనివార్య కారణాలవల్ల ప్రియాంక గాంధీ పర్యటన రద్దయినట్లుగా కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. వీలైతే ఆమె వర్చువల్ గా ఆ పథకాలను ప్రారంభిస్తారని తెలిపాయి. లేని పక్షంలో సీఎం రేవంత్ రెడ్డి రూ.500లకే కి గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల గృహ జ్యోతి ఉచిత విద్యుత్ పథకం గ్యారెంటీలను ప్రారంభించనున్నారనీ పీసీసీ వర్గాలు వెల్లడించాయి.