ప్రభాస్ ఫ్యాన్‌ను తిట్టిన నిర్మాత MS రాజు.. నెటిజన్స్ ఫైర్!
విధాత: తెలుగు సినీ ఇండస్ట్రీలో సుమంత్ ఆర్ట్స్ అధినేతగా నిర్మాతగా ఎమ్మెస్ రాజుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. కానీ ఆయన కుమారుడైన సుమంత్ అశ్విన్ హీరోగా పెద్దగా సక్సెస్ కాలేదు. ఇక నిర్మాతగా ఎన్నో సూపర్ డూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన ఎమ్మెస్ రాజు దర్శకుడి అవతారం ఎత్తారు. వాన, తూనీగా తూనీగా, దట్టి హరి, సెవెన్ డేస్ 6నైట్స్ వంటి ఫ్లాప్ చిత్రాలను తీసి తనకున్న ఇమేజ్‌ను సైతం పోగొట్టుకున్నారు. శత్రువుతో పాటు పోలీస్ లాకప్ […]

విధాత: తెలుగు సినీ ఇండస్ట్రీలో సుమంత్ ఆర్ట్స్ అధినేతగా నిర్మాతగా ఎమ్మెస్ రాజుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. కానీ ఆయన కుమారుడైన సుమంత్ అశ్విన్ హీరోగా పెద్దగా సక్సెస్ కాలేదు. ఇక నిర్మాతగా ఎన్నో సూపర్ డూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన ఎమ్మెస్ రాజు దర్శకుడి అవతారం ఎత్తారు.
వాన, తూనీగా తూనీగా, దట్టి హరి, సెవెన్ డేస్ 6నైట్స్ వంటి ఫ్లాప్ చిత్రాలను తీసి తనకున్న ఇమేజ్‌ను సైతం పోగొట్టుకున్నారు. శత్రువుతో పాటు పోలీస్ లాకప్ వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను ఇచ్చారు. 1987లో మనవడొస్తాడు చిత్రంతో నిర్మాతగా పరిచయమయిన రాజు. ఆ తరువాత శత్రువు, పోలీసులాకప్, స్ట్రీట్ ఫైటర్, దేవి పుత్రుడు ఇలాంటి సినిమాలు చేశారు.
మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్‌లో మనసంతా నువ్వే, నీ స్నేహం, ఒక్కడు , వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్స్ నమోదు చేశారు. ఆ తర్వాత ఆట, వాన, మస్కా చిత్రాలను నిర్మించినా అవి పెద్దగా విజయం సాధించలేదు. ఇక నిర్మాతగా ఎమ్మెస్ రాజు తన కెరీర్‌లో మహేష్ బాబుకు బ్రేక్‌ను ఇచ్చిన ఒక్కడు, ప్రభాస్కు బ్రేక్‌ని ఇచ్చిన వర్షం చిత్రాలను ప్రముఖంగా పేర్కొనాలి.
అయితే ప్రస్తుతం తెలుగులో రీరిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. తాజాగా ఎమ్మెస్ రాజు ఒక్కడు, వర్షం చిత్రాలను రీరిలీజ్ చేశారు. ఈ రెండు సినిమాలు ఆయన బ్యానర్‌లో వచ్చినవే. ఈ చిత్రాలు ఇద్దరు హీరోలకు మాస్ ఇమేజ్ను తీసుకొని వచ్చాయి. అయితే ఒక్కడు సినిమా రీరిలీజ్ సందర్భంగా ఎమ్మెస్ రాజు ఒక ట్వీట్ చేశారు. ‘ఇది ఒక పండుగలా ఉంది. కుదోస్ టూ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్’ అని రాసుకొచ్చారు.
It’s like a concert…kudos to Superstar @urstrulyMahesh fans… #Okkadu pic.twitter.com/9oLvhNPHAR
— MS Raju (@MSRajuOfficial) January 23, 2023
అయితే ఒక్కడుకు ట్వీట్ చేసిన రాజు ప్రభాస్ వర్షం సినిమా రీరిలిజ్ సందర్భంగా ఎలాంటి ట్వీట్ చేయలేదు. దీంతో ఓ ప్రభాస్ అభిమానికి కోపం వచ్చి వర్షం సెలబ్రేషన్స్ మీకు కనిపించడం లేదా? అని కామెంట్ పెట్టాడు. దానికి ఎమ్మెస్ రాజు సడన్‌గా ఒరేయ్ నీయబ్బ మూసుకో అటు సమాధానం ఇచ్చాడు.
అసలు ఎందుకు ఎమ్మెస్ రాజు ఇంత ఫైర్ అయ్యాడు? ఎమ్మెస్ రాజు నిర్మించిన అన్ని సినిమాలు అందరూ హీరోలు అతనికి సమానమే కానీ ఒక అభిమాని అడిగిన ప్రశ్నపై ఎమ్మెస్ రాజు ఈ విధంగా స్పందించడంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
అభిమాని లేవనెత్తిన ప్రశ్న కూడా సహేతుకమైనదే. కానీ దానికి రాజుగారు ఇచ్చిన సమాధానం మాత్రం అందర్నీ ఆశ్చర్యపడేలా చేసింది. ఎదైనా ఉంటే సమాధానం చెప్పాలి గానీ బాభటంగా తిట్టడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.