Tiger cubs: పులి పిల్లల తల్లి ఆచూకీలో పురోగతి

Progress in locating the mother of the tiger cubs విధాత: నాలుగు పులి పిల్లల తల్లి జాడను నంద్యాల కొత్తపల్లి మండలం ముసలిమడుగు దగ్గర కనుగొన్నట్లుగా అటవీ శాఖ అధికారులు తెలిపారు. పులి పిల్లల తల్లి గొర్రెల కాపరులకు కనిపించిందని, పులి పిల్లలు లభ్యమైన ప్రదేశానికి 1.5కిలోమీటర్ల దూరంలో పులి పాద ముద్రలు గుర్తించినట్లుగా, పులి సంచరిస్తున్న ప్రాంతానికి చేరుకున్నట్లుగా అటవీశాఖ అధికారులు తెలిపారు. అటు పెద్దపులి పిల్లలపై హెల్త్ బులిటిన్ విడుదల చేసిన […]

Tiger cubs: పులి పిల్లల తల్లి ఆచూకీలో పురోగతి

Progress in locating the mother of the tiger cubs

విధాత: నాలుగు పులి పిల్లల తల్లి జాడను నంద్యాల కొత్తపల్లి మండలం ముసలిమడుగు దగ్గర కనుగొన్నట్లుగా అటవీ శాఖ అధికారులు తెలిపారు. పులి పిల్లల తల్లి గొర్రెల కాపరులకు కనిపించిందని, పులి పిల్లలు లభ్యమైన ప్రదేశానికి 1.5కిలోమీటర్ల దూరంలో పులి పాద ముద్రలు గుర్తించినట్లుగా, పులి సంచరిస్తున్న ప్రాంతానికి చేరుకున్నట్లుగా అటవీశాఖ అధికారులు తెలిపారు.

అటు పెద్దపులి పిల్లలపై హెల్త్ బులిటిన్ విడుదల చేసిన అటవీ శాఖ అధికారులు తమ సంరక్షణలో ఉన్న నాలుగు పులి పిల్లలు ఆరోగ్యంగా ఉన్నాయని తెలిపారు.

The tiger cubs l ఊళ్లోకి వచ్చిన పులికూనలు!! తల్లికోసం అల్లాడుతున్న‌ చిరు ప్రాణులు