విధాత: స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్‌ర్ అని ఆరోజుల్లో అన్నమాట నిజమే అనిపిస్తోంది. నిన్న చనిపోయిన ఎనిమిది మంది శవాల మీద ఓట్లు ఏరుకునే రాజకీయం మొదలైంది. జనం పోతే పోయారు పార్టీకి లాభించిందని టీడీపీ కార్యకర్తలు లోలోన సంబుర పడుతున్నారు.
నిన్నటి నుండి సంతోషంతో ఉన్న వాళ్ళు మొత్తం రావలమ్మ!
ఇది చూసి, ఈ రోజు ఏడవాలమ్మ!#CBNInKaavali pic.twitter.com/nyryCLahYt
— Tdp Trending (@tdptrending) December 29, 2022
నిన్న కందుకూరులో చంద్రబాబు సభలో ఎనిమిదిమంది చనిపోయిన దుర్ఘటనకు టీడీపీ, వైసీపీలు ఎవరికి తోచిన భాష్యం వాళ్ళు చెప్పుకుంటున్నారు. వైసీపీ ఈ ఘటనను ఎలాగూ తూర్పారబడుతుంది.. గర్హిస్తుంది. కానీ, విచిత్రంగా టీడీపీ మాత్రం ఆ దుర్ఘటనను తమ ఘనత, మైలేజీ వచ్చే అంశంగా ఫోకస్ చేసుకుంటుండడం చింతించాల్సిన అంశం.
ఎంత బెదిరించినా వెయ్యిమంది కూడా రాని జగన్ రెడ్డి మీటింగుకి పరదాలు, బారికేడ్లు, రోప్ పార్టీలు, 2000మంది పోలీసుల బందోబస్తు. స్వచ్ఛందంగా 50వేలమంది వచ్చిన చంద్రబాబుగారి మీటింగుకి 150మంది పోలీసుల బందోబస్తా? కందుకూరు ప్రమాదానికి బాద్యులెవరో చెప్పడానికి ఈ నిదర్శనం చాలదా? pic.twitter.com/TLPUfNSlPo
— Telugu Desam Party (@JaiTDP) December 29, 2022
డ్రోన్ కెమెరాలతో జనాలను ఎగబడినట్టుగా చిత్రీకరించి పబ్లిసిటీ పొందే ప్రయత్నం చేసి తాము తీవ్ర ఘాతుకానికే పాల్పడినా.. చంద్రబాబులో కానీ, ఆయన ఈవెంట్ మేనేజ్ మెంట్ టీమ్‌లో కానీ కించిత్ పశ్చాతాపం లేదు. ఇరుకు సందుల్లోకి వెళ్లి అక్కడకు జనాలను సమీకరించి వీడియోలు తీసి.. ప్రజలు చంద్రబాబు కోసం ఎగ బడుతున్నారనే భ్రమను కల్పించే ప్రయత్నం దారుణంగా వికటించింది.
బాధ్యత గల పార్టీ తెలుగుదేశం అని నిరూపించినందుకు కృతజ్ఞతతో… pic.twitter.com/XLBcevNDO4
— Tdp Trending (@tdptrending) December 28, 2022
చంద్రబాబు అంటే విపరీతమైన క్రేజ్ తోనే ఇలాంటి ఘటన జరిగినట్టుగా చిత్రీకరించడానికి ఆల్రెడీ సోషల్ మీడియాలో టీడీపీ కార్యకర్తలు రేసి అయ్యారు. ట్విట్టర్, ఫేసుబుక్కులో పోష్టుల పరంపర మొదలైంది. టీడీపీ అభిమానులు అయితే చంద్రబాబు పట్ల క్రేజీ విపరీతంగా పెరగడం అనే దానికి ఈ దుర్ఘటన ఓ రుజువు అన్నట్లుగా పోష్టులు పెడుతున్నారు.
కాకుమాని రాజ అన్న…
అప్పటి వరకు మా నాన్న గారితో కూర్చొని టీ త్రాగిన వ్యక్తి..అంత జనాల్లో ఎందుకులే రాజా ఇక్కడే కూర్చొని టీవీ లో చూద్దాం అంటే..ఆయన మనకోసం అంత దూరం నుండి వస్తే మనం పోకపోతే ఎలా అని వెళ్ళాడు..
Miss you raja anna.. pic.twitter.com/5Gy0zt6G5h
— Venkata Sai Ram (@bobbysairam) December 29, 2022
జనాలు పోతే పోయారు మనకు రాజకీయంగా హైప్ వచ్చింది.. మన బాబుగారి గ్రాఫ్ పెరిగింది అనే భావనలో టీడీపీ కార్యకర్తలు ఉన్నారు. ఇంకా నయం మృతుల కుటుంబీకులు సైతం తమవారి ఆశయాలు కొనసాగిస్తామని, చంద్రబాబు వెంట నడుస్తామని చెబుతున్నట్లు సోషల్ మీడియాలో పోష్టులు చూస్తున్న కొందరైతే అసలు సిసలైన శవ రాజకీయం ఇదేనని తుపుక్కున ఉమ్మేస్తున్నారు.
వైసీపీ నాయకులారా, మీకు బుద్ధుంటే ప్రజల ఆగ్రహం చూడండి. – @ncbn#IdhemKarmaManaRashtraniki #CBNInKavali #CBNInNellore #TDPforDevelopment #NCBN pic.twitter.com/FxNQxjnbjZ
— Telugu Desam Party (@JaiTDP) December 29, 2022