‘పుడమి’ సాహితీ సేవలు ప్రశంసనీయం: గుత్తా

విధాత: పుడమి సాహితి వేదిక సంస్థ రచన, సాహిత్య రంగానికి చేస్తున్నసేవలు ప్రశంసనీయమని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నల్లగొండలో పుడమి సాహితీ వేదిక జాతీయ అధ్యక్షుడు చిలుముల బాల్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన చాచాజీ జవహర్‌లాల్ నెహ్రూ స్మారక జాతీయ పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమంలో ముఖ్య అథితిగా గుత్తా ప్రసంగించారు. నల్ల‌గొండ నుండి మొదలైన పుడమి సంస్థ జాతీయ స్థాయి సాహితీ సంస్థగా ఎద‌గ‌డం జిల్లాకు గర్వకారణమన్నారు. యువ, ఔత్సాహిక, […]

  • By: krs    latest    Nov 25, 2022 1:27 PM IST
‘పుడమి’ సాహితీ సేవలు ప్రశంసనీయం: గుత్తా

విధాత: పుడమి సాహితి వేదిక సంస్థ రచన, సాహిత్య రంగానికి చేస్తున్నసేవలు ప్రశంసనీయమని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నల్లగొండలో పుడమి సాహితీ వేదిక జాతీయ అధ్యక్షుడు చిలుముల బాల్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన చాచాజీ జవహర్‌లాల్ నెహ్రూ స్మారక జాతీయ పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమంలో ముఖ్య అథితిగా గుత్తా ప్రసంగించారు.

నల్ల‌గొండ నుండి మొదలైన పుడమి సంస్థ జాతీయ స్థాయి సాహితీ సంస్థగా ఎద‌గ‌డం జిల్లాకు గర్వకారణమన్నారు. యువ, ఔత్సాహిక, నవ రచయితలను ప్రోత్సహిస్తు భాషా, సాహితీ రంగాల సమృద్ధికి పుడమి చేస్తున్న కృషికి తనవంతు చేయూత అందిస్తానని హామీనిచ్చారు.

అనంతరం నెహ్రు స్మారక పురస్కారాలను అవార్డు గ్రహీతలకు గుత్తా అంద‌జేసి, సన్మానించారు . కార్యక్రమంలో నల్లగొండ జిల్లా పరిషత్ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, ప్రముఖ కవి రచయిత మునాసు వెంకట్, పాతూరి ఇంద్రసేనారెడ్డి, మమతారెడ్డి, డా.కత్తుల హరి, డా.మునీర్ అహ్మద్ షరీప్ తదితరులు పాల్గొన్నారు