Banwari Lal Purohit | పంజాబ్‌ గవర్నర్‌ పదవికి భన్వరీలాల్‌ గుడ్‌బై..

పంజాబ్‌ గవర్నర్‌, చండీగడ్‌ అడ్మినిస్ట్రేషన్‌ పదవికి భన్వరీలాల్‌ పురోహిత్‌ రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు శనివారం ఆయన ప్రకటించారు

  • By: Somu    latest    Feb 03, 2024 11:36 AM IST
Banwari Lal Purohit | పంజాబ్‌ గవర్నర్‌ పదవికి భన్వరీలాల్‌ గుడ్‌బై..

Banwari Lal Purohit | పంజాబ్‌ గవర్నర్‌, చండీగడ్‌ అడ్మినిస్ట్రేషన్‌ పదవికి భన్వరీలాల్‌ పురోహిత్‌ రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు శనివారం ఆయన ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాజీనామాను పంపిన ఆయన.. రాజీనామాను ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. పంజాబ్ గవర్నర్‌గా 2021 ఆగస్టులో భన్వరీలాల్ బాధ్యతలు స్వీకరించారు. 2017 నుంచి 2021 వరకు తమిళనాడు, 2016 నుంచి 2017 వరకు అసోం గవర్నర్‌ పదవీ బాధ్యతలు పని చేశారు. ఆయన బీజేపీ నేత. నాగ్‌పూర్ పార్లమెంట్‌ నుంచి మూడుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. పురోహిత్ 1940 ఏప్రిల్ 16న రాజస్థాన్‌లో జన్మించారు.


పంజాబ్‌ గవర్నర్‌గా పని చేస్తున్న సమయంలో ప్రభుత్వంతో వివాదం కొనసాగింది. పలు విషయాలపై ప్రభుత్వాన్ని సమాచారం కోరుతూ ఇబ్బందులకు గురి చేశారు. పంజాబ్ అసెంబ్లీ విషయంలో సుప్రీంకోర్టు వరకు చేరింది. అసెంబ్లీ సెషన్‌ ఆమోదముద్ర వేసిన బిల్లులను తొక్కి పెట్టగా.. సీఎం భగవంత్ మాన్ సహా ఆమ్ ఆద్మీ పార్టీ విమర్శలు గుప్పించారు. సీఎం భగవంత్ మాన్ సైతం శుక్రవారం గవర్నర్‌ తమను వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సరైందని కాదన్నారు.