పూర్ణకుంభంతో స్వాగతం.. తోసేసిన వైఎస్ షర్మిల
విధాత: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విమర్శల పాలవుతున్నారు. రెండు రోజుల క్రితం పాలేరు నియోజకవర్గంలో పార్టీ కార్యాలయం భూమిపూజకు వెళ్లిన షర్మిలకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆమె పూర్ణకుంభాన్ని పక్కకు తోసేసి, ముందుకు పోవాలని సూచించారు. BIGGBOSS: బిగ్ బాస్ సీజన్-6 విజేత రేవంత్ అంతేకాదు ఓ మహిళ బొట్టు పెట్టేందుకు ముందుకు రాగా, ఆమె చేతిని కూడా తోసేసింది షర్మిల. తనకు బొట్టు వద్దంటూ సూచించింది. పూర్ణకుంభాన్ని తోసేయడం, […]

విధాత: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విమర్శల పాలవుతున్నారు. రెండు రోజుల క్రితం పాలేరు నియోజకవర్గంలో పార్టీ కార్యాలయం భూమిపూజకు వెళ్లిన షర్మిలకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆమె పూర్ణకుంభాన్ని పక్కకు తోసేసి, ముందుకు పోవాలని సూచించారు.
అంతేకాదు ఓ మహిళ బొట్టు పెట్టేందుకు ముందుకు రాగా, ఆమె చేతిని కూడా తోసేసింది షర్మిల. తనకు బొట్టు వద్దంటూ సూచించింది. పూర్ణకుంభాన్ని తోసేయడం, బొట్టును తిరస్కరించడంపై హిందూ సంఘాలు షర్మిలపై తీవ్రంగా మండిపడుతున్నాయి. షర్మిలకు హిందూ ధర్మంపై గౌరవం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పూర్ణకుంభంతో స్వాగతం.. తోసేసిన వైఎస్ షర్మిల https://t.co/mbSkVzLd6y pic.twitter.com/ErqPIB6QU2
— vidhaathanews (@vidhaathanews) December 18, 2022
ఖమ్మం జిల్లా శివారులోని కరుణగిరి చర్చికి ఎదురుగా ఉన్న ఎకరా స్థలంలో పాలేరు పార్టీ కార్యాలయం కోసం వైఎస్ షర్మిల భూమి పూజ చేశారు. కార్యక్రమంలో పాలేరు నియోజకవర్గానికి చెందిన షర్మిల మద్దతుదారులు పాల్గొన్నారు.