ఆధునిక తాటి వంగడాలతో సత్వర లాభాలు: ఎమ్మెల్యే పైళ్ల, మాజీ ఎంపీ బూర
విధాత, నల్లగొండ: ఆధునిక తాటి విత్తనాలు వంగడాలతో గీత కార్మికులు తక్కువ కాలంలో లాభాలు పొందవచ్చని ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. ఆదివారం భువనగిరి మండలం నందనం గ్రామంలో బీఎల్ఆర్ ఫౌండేషన్, నందా సేవ కమిటీ ఆధ్వర్యంలో నందనం నీరా ఉత్పత్తి కేంద్రం వద్ద బీహార్ తాటి పొట్టి రకం విత్తనాలు నాటడంతో పాటు పలువురు గీత కార్మికులకు విత్తనాల పంపిణీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ […]

విధాత, నల్లగొండ: ఆధునిక తాటి విత్తనాలు వంగడాలతో గీత కార్మికులు తక్కువ కాలంలో లాభాలు పొందవచ్చని ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. ఆదివారం భువనగిరి మండలం నందనం గ్రామంలో బీఎల్ఆర్ ఫౌండేషన్, నందా సేవ కమిటీ ఆధ్వర్యంలో నందనం నీరా ఉత్పత్తి కేంద్రం వద్ద బీహార్ తాటి పొట్టి రకం విత్తనాలు నాటడంతో పాటు పలువురు గీత కార్మికులకు విత్తనాల పంపిణీ నిర్వహించారు.

ఈ సందర్భంగా మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి లు మాట్లాడుతూ.. బీహార్ తాటి పొట్టి వంగడాలు నాటడం ద్వారా వచ్చే చెట్లు 15 నుంచి 20 ఫీట్ల హైటు మాత్రమే పెరిగి, 10 సంవత్సరాల లోపే కల్లు వచ్చే అవకాశం ఉన్నందున గీత కార్మికులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు.
తక్కువ ఎత్తు చెట్టు పైనుండి కిందపడే ప్రమాదాలు ఉండవన్నారు. విత్తనాలు పెట్టడమే కాకుండా వాటి పోషణ, నిర్వహణలను గౌడ సంఘ సభ్యులు దగ్గరుండి చూసుకొని లాభాలు పొంది తద్వారా ఆర్థిక పరిపుష్టి సాధించాలని ఆకాంక్షించారు.

సీఎం కేసీఆర్ నీరా సెంటర్ ని హైదరాబాద్‌లో గల ట్యాంకుబండు ప్రాంతంలో అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారని, ఇది చాలా సంతోషకరమైన విషయమన్నారు. తాటి మరియు ఈత కల్లులో ఔషధ గుణాలు ఉంటాయని ఈ విషయాన్ని నిపుణులు సైతం ధ్రువీకరణ చేశారని అన్నారు. నందనంలో ప్రభుత్వం నీరా కేంద్రం ఏర్పాటు చేయడం, తాటి పొట్టి వంగడాలను ఇక్కడ నాటే అవకాశం కలిగినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.
