Rachakonda CP | బోనాల పండుగకు.. కట్టుదిట్టమైన భద్రత: రాచకొండ CP DS చౌహాన్
Rachakonda CP విధాత: తెలంగాణ బోనాల పండుగ నిర్వహణకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ అధికారులని ఆదేశించారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో త్వరలో జరగనున్న తెలంగాణ రాష్ట్ర బోనాల పండుగ నిర్వహణకు సంబంధించి శుక్రవారం రాచకొండ కమిషనర్ డీఎస్ చౌహాన్ ఐపీఎస్, నేరెడ్మెట్ లోని కమిషనరేట్ ఆఫీసులో రాచకొండ పోలిస్ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర బోనాల పండుగ సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భంగా […]

Rachakonda CP
విధాత: తెలంగాణ బోనాల పండుగ నిర్వహణకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ అధికారులని ఆదేశించారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో త్వరలో జరగనున్న తెలంగాణ రాష్ట్ర బోనాల పండుగ నిర్వహణకు సంబంధించి శుక్రవారం రాచకొండ కమిషనర్ డీఎస్ చౌహాన్ ఐపీఎస్, నేరెడ్మెట్ లోని కమిషనరేట్ ఆఫీసులో రాచకొండ పోలిస్ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర బోనాల పండుగ సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భంగా కమిషనర్ అధికారులను ఆదేశించారు.
బోనాల పండుగ సందర్భంగా ప్రజల సహకారంతో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా విధులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. సున్నితమైన ప్రాంతాలలో అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని, సమర్థవంతమైన సిబ్బందితో బందోబస్తు ఏర్పాట్లు చేయాలన్నారు.
ప్రజలు శాంతియుతంగా, సంతోషంగా బోనాల పండుగ జరుపుకోవాలని, తమ చర్యల ద్వారా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులతో సహకరించాలని తెలిపారు. బందోబస్తు ఏర్పాట్లు చేసే సందర్భంలో ఇతర ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ బందోబస్తు ఏర్పాట్లు చేయాలని, ఆయా ప్రాంతాల్లో సీసీ టీవీల పనితీరును పరిశీలిస్తూ ఉండాలని సూచించారు.
మహిళల పట్ల ఎవరూ అసభ్యకరంగా ప్రవర్తించకుండా, వారు ఎటువంటి వేధింపులకు గురికాకుండా షి టీమ్స్ బృందాలు ఎల్లవేళలా విధుల్లో ఉండాలన్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో మత సామరస్యం కాపాడడానికి అవసరమైన అన్ని రకాల చర్యలూ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం నిర్వహించిన క్రైం రివ్యు సమావేశంలో, అన్ని జోన్లలో నేర శాతం తగ్గింపు కోసం చర్యలు చేపట్టాలని, పాత నేరస్తుల మీద నిఘా వేసి ఉంచాలని అధికారులను ఆదేశించారు.
క్రమం తప్పకుండా వాహనాల నంబర్ ప్లేట్ల చెకింగ్, పత్రాల చెకింగ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో రాచకొండ జాయింట్ సీపీ సత్యనారాయణ, డీసీపీ లు, ఏసిపిలు, ఇన్స్పెక్టర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.