రాహుల్‌.. కాస్కో: మంచు విసిరి.. తమ్మడితో అక్క ప్రియాంక గాంధీ సరదా

శ్రీనగర్‌లో జోడో యాత్ర ముగింపు సభ వద్ద సరదా సన్నివేశం విధాత‌: రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ముగింపు సభ రోజు అన్నా చెల్లెలి సరదాను చూసి శ్రీనగర్ ముచ్చట పడింది. దేశ వ్యాప్తంగా సాగిన యాత్ర పొడ‌వునా ఉత్సాహంగా, హుషారుగా న‌డిచిన రాహుల్ గాంధీ చివ‌రి రోజున జమ్ము కశ్మీర్ లోని శ్రీనగర్‌లో అంతకు మించిన ఉత్సాహాన్ని చూపారు. మంచుతో క‌ప్ప‌బ‌డి ఉన్న ర‌హ‌దారులు, ప‌రిస‌రాల్లో న‌డుస్తూ.. మంచును చేతుల్లోకి తీసుకొని కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల‌పైకి […]

రాహుల్‌.. కాస్కో: మంచు విసిరి.. తమ్మడితో అక్క ప్రియాంక గాంధీ సరదా
  • శ్రీనగర్‌లో జోడో యాత్ర ముగింపు సభ వద్ద సరదా సన్నివేశం

విధాత‌: రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ముగింపు సభ రోజు అన్నా చెల్లెలి సరదాను చూసి శ్రీనగర్ ముచ్చట పడింది. దేశ వ్యాప్తంగా సాగిన యాత్ర పొడ‌వునా ఉత్సాహంగా, హుషారుగా న‌డిచిన రాహుల్ గాంధీ చివ‌రి రోజున జమ్ము కశ్మీర్ లోని శ్రీనగర్‌లో అంతకు మించిన ఉత్సాహాన్ని చూపారు.

మంచుతో క‌ప్ప‌బ‌డి ఉన్న ర‌హ‌దారులు, ప‌రిస‌రాల్లో న‌డుస్తూ.. మంచును చేతుల్లోకి తీసుకొని కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల‌పైకి విసురుతూ సరదా చేశారు. ఆ క్ర‌మంలోనే.. దూరంగా కార్య‌క‌ర్త‌ల్లో ఉన్న తన చెల్లెలు ప్రియాంక గాంధీ వాధ్రాను సమీపించి.. వెనుక‌కు దాచుకొన్న పిడికిట్లో తెచ్చిన మంచును ఆమె త‌ల‌పై పోశాడు.