రాహుల్ గాంధీ సింప్లి సిటీ.. చిన్నారికి చెప్పులు సరి చేసి తొడిగి..!(Video)
విధాత: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర జోరుగా కొనసాగుతోంది. రాహుల్ వెంట వేలాది మంది కార్యకర్తలు పాదయాత్ర చేస్తున్నారు. కేరళలోని హరిపాడ్‌లో కొనసాగుతోన్న భారత్ జోడో యాత్రలో ఓ అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. ఆదివారం ఉదయం 6:30 గంటలకు రాహుల్ పాదయాత్ర ప్రారంభమైంది. ఇక దారిలో ఓ చిన్నారి కూడా రాహుల్‌ను అనుసరించింది. ఆ బాలిక నడుస్తుండగా ఆమె చెప్పు ఊడిపోయింది. ఈ విషయాన్ని గమనించిన రాహుల్ గాంధీ.. ఆ […]

విధాత: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర జోరుగా కొనసాగుతోంది. రాహుల్ వెంట వేలాది మంది కార్యకర్తలు పాదయాత్ర చేస్తున్నారు. కేరళలోని హరిపాడ్‌లో కొనసాగుతోన్న భారత్ జోడో యాత్రలో ఓ అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది.
ఆదివారం ఉదయం 6:30 గంటలకు రాహుల్ పాదయాత్ర ప్రారంభమైంది. ఇక దారిలో ఓ చిన్నారి కూడా రాహుల్‌ను అనుసరించింది. ఆ బాలిక నడుస్తుండగా ఆమె చెప్పు ఊడిపోయింది. ఈ విషయాన్ని గమనించిన రాహుల్ గాంధీ.. ఆ బాలికకు చెప్పులు సరి చేసి తొడిగించారు.
ఈ వీడియోను మొదటగా కాంగ్రెస్ నాయకురాలు నీతా డీసౌజా తన ట్విట్టర్ పేజీలో షేర్ చేశారు. సింప్లి సిటీ, లవ్ అని రాశారు ఆమె. ఈ రెండు దేశ సమైక్యతకు అవసరమని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక రాహుల్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.