Rahul Gandhi | ఫుడ్ డెలివ‌రీ బాయ్ బైక్‌పై రాహుల్ ప్ర‌యాణం.. వారితో క‌లిసి టిఫిన్.. వీడియో వైర‌ల్

Rahul Gandhi | కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు రాహుల్ గాంధీ.. కర్ణాట‌క ఎన్నిక‌ల ప్ర‌చారంలో దూసుకెళ్తున్నారు. త‌న ప్ర‌చార పంథాను రాహుల్ మార్చుకున్నారు. మాస్ జ‌నాల‌తో రాహుల్ ఇంట‌రాక్ట్ అవుతున్నారు. వారి క‌ష్టసుఖాల‌ను తెలుసుకుంటున్నారు. అయితే రాహుల్ గాంధీ ఆదివారం ఫుడ్ డెలివ‌రీ బాయ్స్‌తో స‌మావేశ‌మ‌య్యారు. బెంగ‌ళూరులోని ఓ హోట‌ల్‌లో ఆయా సంస్థ‌ల‌కు చెందిన ఫుడ్ డెలివ‌రీ బాయ్స్‌తో స‌మావేశ‌మై వారి ఆర్థిక క‌ష్టాల‌తో పాటు ఇత‌ర విష‌యాల‌ను అడిగి తెలుసుకున్నారు. వారితో క‌లిసి దోశ […]

Rahul Gandhi | ఫుడ్ డెలివ‌రీ బాయ్ బైక్‌పై రాహుల్ ప్ర‌యాణం.. వారితో క‌లిసి టిఫిన్.. వీడియో వైర‌ల్

Rahul Gandhi |

కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు రాహుల్ గాంధీ.. కర్ణాట‌క ఎన్నిక‌ల ప్ర‌చారంలో దూసుకెళ్తున్నారు. త‌న ప్ర‌చార పంథాను రాహుల్ మార్చుకున్నారు. మాస్ జ‌నాల‌తో రాహుల్ ఇంట‌రాక్ట్ అవుతున్నారు. వారి క‌ష్టసుఖాల‌ను తెలుసుకుంటున్నారు.

అయితే రాహుల్ గాంధీ ఆదివారం ఫుడ్ డెలివ‌రీ బాయ్స్‌తో స‌మావేశ‌మ‌య్యారు. బెంగ‌ళూరులోని ఓ హోట‌ల్‌లో ఆయా సంస్థ‌ల‌కు చెందిన ఫుడ్ డెలివ‌రీ బాయ్స్‌తో స‌మావేశ‌మై వారి ఆర్థిక క‌ష్టాల‌తో పాటు ఇత‌ర విష‌యాల‌ను అడిగి తెలుసుకున్నారు. వారితో క‌లిసి దోశ తిన్నారు.

అయితే ఆ హోట‌ల్‌కు చేరుకునేందుకు ఫుడ్ డెలివ‌రీ బాయ్ బైక్‌పై రాహుల్ 2 కిలోమీట‌ర్లు ప్ర‌యాణించారు. ప్ర‌చారం చేస్తున్న ప్రాంతం నుంచి హోట‌ల్‌కు బైక్‌పై బ‌య‌ల్దేర‌డంతో అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయారు. రాహుల్ గాంధీ కూడా హెల్మెట్ ధ‌రించి ప్ర‌యాణించారు.

భార‌త్ జోడో యాత్ర‌ను ప్రారంభించిన‌ప్ప‌టి నుంచి రాహుల్ గాంధీ త‌న ప్ర‌చార పంథాను మార్చుకున్న సంగ‌తి తెలిసిందే. మాస్ జ‌నాల‌తో రాహుల్ మ‌మేక‌మ‌వుతూ, వారి ప‌రిస్థితుల‌ను తెలుసుకుంటున్నారు. భార‌త్ జోడో యాత్ర చేప‌ట్టిన రాహుల్.. ఎంతో మంది పేద‌ల హృద‌యాల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నారు.

గ‌త నెల‌లో రాహుల్ గాంధీ ఓల్డ్ ఢిల్లీలోని మతియా మహల్ మార్కెట్‌, బెంగాలి మార్కెట్‌కు వెళ్లారు. అక్కడ చాలా సేపు షాపింగ్ చేశారు. అక్కడి ఫేమస్ వంటకాలన్నీ రుచి చూశారు. స్థానికంగా అందరూ ఎంతో ఇష్టపడే షర్బత్ తాగారు. పండ్లు తిన్నారు. ఆ తరవాత పానీపూరి కూడా టేస్ట్ చేశారు. అక్కడే కాదు. ఢిల్లీలోని ఫేమస్ ఫుడ్ పాయింట్‌లకు వెళ్లి సందడి చేశారు.