కేరళ స్నేక్ బోట్ రేసులో పాల్గొన్న రాహుల్ గాంధీ (Video)

విధాత: కాంగ్రెస్ నాయ‌కుడు రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర జోరుగా కొన‌సాగుతోంది. త‌మిళ‌నాడులోని క‌న్యాకుమారిలో ప్రారంభ‌మైన ఈ యాత్ర‌.. ప్ర‌స్తుతం కేర‌ళ‌లో కొన‌సాగుతోంది. ఇక విరామ స‌మ‌యంలో రాహుల్ ప‌లు కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటూ.. పార్టీ కార్యక‌ర్త‌ల్లో హుషారు తీసుకొస్తున్నారు. కేర‌ళ‌లోని పున్న‌మాడ లేక్‌లో ఇవాళ‌ నిర్వ‌హించిన స్నేక్ బోట్ రేస్ ఎగ్జిబిష‌న్‌లో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ రేసులో రెండు బోట్లు పాల్గొన‌గా.. రాహుల్ ఉన్న బోటు గెలుపొందింది. స్నేక్ బోటు రేసులో పాల్గొన్న […]

  • By: krs    latest    Sep 19, 2022 1:24 PM IST
కేరళ స్నేక్ బోట్ రేసులో పాల్గొన్న రాహుల్ గాంధీ (Video)

విధాత: కాంగ్రెస్ నాయ‌కుడు రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర జోరుగా కొన‌సాగుతోంది. త‌మిళ‌నాడులోని క‌న్యాకుమారిలో ప్రారంభ‌మైన ఈ యాత్ర‌.. ప్ర‌స్తుతం కేర‌ళ‌లో కొన‌సాగుతోంది. ఇక విరామ స‌మ‌యంలో రాహుల్ ప‌లు కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటూ.. పార్టీ కార్యక‌ర్త‌ల్లో హుషారు తీసుకొస్తున్నారు.

కేర‌ళ‌లోని పున్న‌మాడ లేక్‌లో ఇవాళ‌ నిర్వ‌హించిన స్నేక్ బోట్ రేస్ ఎగ్జిబిష‌న్‌లో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ రేసులో రెండు బోట్లు పాల్గొన‌గా.. రాహుల్ ఉన్న బోటు గెలుపొందింది. స్నేక్ బోటు రేసులో పాల్గొన్న మిగ‌తా వారితో పోటీగా రాహుల్ ఈ విజ‌యంలో పాలు పంచుకున్నారు.

రాహుల్ బోటు రేసులో పాల్గొన్న వీడియోను ఇండియ‌న్ యూత్ కాంగ్రెస్ నేష‌న‌ల్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ బీవీ త‌న ట్విట్ట‌ర్ పేజీలో షేర్ చేశారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఇక నిన్న పాద‌యాత్ర‌లో భాగంగా ఓ చిన్నారి కాలి చెప్పులు ఊడి పోవ‌డంతో.. ఆమె చెప్పులు స‌రి చేసి, తొడిగించి రాహుల్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన సంగ‌తి తెలిసిందే.

ఇలా రాహుల్ భార‌త్ జోడో యాత్ర‌లో భాగంగా ప‌లు కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటూ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తున్నారు. భార‌త్ జోడో యాత్ర 12 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల మీదుగా కొన‌సాగుతోంది.