మునుగోడు: ప్రచారానికి రాజగోపాల్ రెడ్డి దూరం.. పేలుతున్న సెటైర్లు
విధాత: మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతుంది. ఈ క్రమంలో మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనారోగ్యం బారిన పడ్డారు. ఆయన తీవ్ర జ్వరంతో బాధ పడుతుండగా.. ప్రచారానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. వీలైనంత త్వరగా ఆయన ప్రచారంలో పాల్గొంటారని రాజగోపాల్ వర్గీయులు చెబుతున్నారు. అయితే షెడ్యూల్ ప్రకారం నేడు మునుగోడులోని నాంపల్లి మండలంలో ప్రచారం చేయాల్సి ఉంది. కానీ ఆయన జ్వరంతో బాధపడుతుండడంతో ప్రచారాన్ని రద్దు చేసుకున్నారు. అయితే […]

విధాత: మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతుంది. ఈ క్రమంలో మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనారోగ్యం బారిన పడ్డారు. ఆయన తీవ్ర జ్వరంతో బాధ పడుతుండగా.. ప్రచారానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. వీలైనంత త్వరగా ఆయన ప్రచారంలో పాల్గొంటారని రాజగోపాల్ వర్గీయులు చెబుతున్నారు.
అయితే షెడ్యూల్ ప్రకారం నేడు మునుగోడులోని నాంపల్లి మండలంలో ప్రచారం చేయాల్సి ఉంది. కానీ ఆయన జ్వరంతో బాధపడుతుండడంతో ప్రచారాన్ని రద్దు చేసుకున్నారు. అయితే బీజేపీ ముఖ్య నేతలు ప్రచారాన్ని కొనసాగించాలని రాజగోపాల్ రెడ్డి సూచించారు.
ఇక మునుగోడు ఉపఎన్నిక దగ్గర పడుతుండడంతో బీజేపీ భారీ బహిరంగ సభను ప్లాన్ చేసింది. అన్నీ కుదిరితే ఈనెల 31న మునుగోడులో భారీ బహిరంగ సభను నిర్వహించేలా బీజేపీ ప్రణాళికలు రచిస్తుంది. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యే అవకాశం ఉంది.
ఈ సభలోపే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోలుకోవాలని బీజేపీ కార్యకర్తలు ఆశిస్తున్నారు. మరి ఈ సమయంలో రాజగోపాల్ రెడ్డి అనారోగ్యం బారిన పడడం బీజేపీకి కొంత మైనస్ అనే చెప్పుకోవాలి.
స్టార్ట్.. కెమెరా..యాక్షన్
మునుగోడు ఉపఎన్నికతో రాష్ర రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ప్రచారంలో ఎక్కడా తగ్గేదేలే అంటున్నారు.
ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీలు మునుగోడుపై వరాల జల్లును కురిపిస్తున్నాయి. ఓ వైపు ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తూనే తమ పార్టీని గెలిపిస్తే ఇలా అభివృద్ధి చేసి చూపిస్తామని హామీల వర్షం కురిపిస్తున్నారు.
ఎన్నికల సమయంలో బీజేపీ అభ్యర్థులు ఓటర్ణ సానుభూతి కోసం కాలుకు గానీ , చేతికి గానీ పట్టి కట్టుకునే ప్రయత్నాలు చేస్తారనే ప్రచారం ఉన్నది. బండి సంజయ్, రఘునందన్, ఈటల రాజేందర్ ఎన్నికల సమయంలో ఇలా కనిపించారు అన్నది వారి సెటైర్. తాజాగా బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి జ్వరం రావడంతో ప్రచారానికి బ్రేక్ పడింది.
దీన్ని వాళ్ళ ప్రత్యర్థి పార్టీ టీఆర్ఎస్ స్టార్ట్.. కెమెరా..యాక్షన్.. అంటూ వ్యంగ్యంగా పోస్టులు పెడుతున్నది. బీజేపీ కూడా కేసీఆర్ చేసిన మోసాలు ఇదిగో అంటూ పోస్టర్లు విడుదల చేసింది.
శృంగారంతో బీపీకి చెక్.. కంటి నిండా నిద్ర.. మతిమరుపు మాయం!
పోలింగ్ కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ మీమ్స్, కార్టూన్లు, సెటైర్ లతో ప్రధాన పార్టీలు ఓటర్లను ఆకట్టకునేందుకు అనేక విన్యాసాలు చేస్తున్నాయి.