10న నామినేషన్ వేస్తా: రాజగోపాల్ రెడ్డి

విధాత‌: టీఆర్ఎస్ ప్రభుత్వంపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. మునుగోడు ప్రజల తీర్పుతో కేసీఆర్ పతనం మొదలవుతుందన్నారు. తాను 10వ తేదీన నామినేషన్ వేస్తున్నానని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ఎనిమిదేళ్ళలో కేసీఆర్ కుటుంబం దోచుకున్న లక్ష కోట్ల అవినీతి సొమ్మును బయటకు తెచ్చేంత వరకు నిద్రపోనని, కేటీఆర్ కుటుంబమంతా జైలుకు పోయేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. మద్యం కుంభకోణంలో కవిత పాత్ర రుజువైందని. ఈ సారి చంచల్ గూడ లేక తీహార్ జైల్లో కవిత బతుకమ్మ […]

10న నామినేషన్ వేస్తా: రాజగోపాల్ రెడ్డి

విధాత‌: టీఆర్ఎస్ ప్రభుత్వంపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. మునుగోడు ప్రజల తీర్పుతో కేసీఆర్ పతనం మొదలవుతుందన్నారు. తాను 10వ తేదీన నామినేషన్ వేస్తున్నానని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ఎనిమిదేళ్ళలో కేసీఆర్ కుటుంబం దోచుకున్న లక్ష కోట్ల అవినీతి సొమ్మును బయటకు తెచ్చేంత వరకు నిద్రపోనని, కేటీఆర్ కుటుంబమంతా జైలుకు పోయేందుకు సిద్ధంగా ఉండాలన్నారు.

మద్యం కుంభకోణంలో కవిత పాత్ర రుజువైందని. ఈ సారి చంచల్ గూడ లేక తీహార్ జైల్లో కవిత బతుకమ్మ ఆడుతారన్నారు. మునుగోడు ప్రజలు ఇచ్చే తీర్పు చరిత్రలో నిలిచి పోతోందన్నారు. కేసీఆర్ పతనం ఇక్కడే మొదలవుతుందని. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి నాకు పోటీనే కాదని. ప్రజల యుద్ధం కేసీఆర్ పైనే అని పేర్కొన్నారు.