రాజగోపాల్‌కు విజయంపై ఆశలు సన్నగిల్లాయా?
విధాత: మునుగోడు ఉపఎన్నికలో నైతిక విజయం తనదేనని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఉపఎన్నిక ప్రచారానికి టీఆర్ఎస్ 84 మంది ఎమ్మెల్యేలు, 16 మంది మంత్రులను దించినప్పుడే తన విజయం ఖాయమైందన్నారు. అలాగే చౌటుప్పల్ మండలంలో తాను ఆశించిన ఓట్లు రాలేదని రాజగోపాల్ అంగీకరించారు. అక్కడ మొదటి నుంచి బీజేపీకి భారీ మెజారిటీ వస్తుందనే ప్రచారం జరిగింది. కానీ వాస్తవ ఫలితాల్లోకి వచ్చే సరికి మెజారిటీ సంగతి ఏమో గాని అసలు ఆ మండలంలోని […]

విధాత: మునుగోడు ఉపఎన్నికలో నైతిక విజయం తనదేనని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఉపఎన్నిక ప్రచారానికి టీఆర్ఎస్ 84 మంది ఎమ్మెల్యేలు, 16 మంది మంత్రులను దించినప్పుడే తన విజయం ఖాయమైందన్నారు. అలాగే చౌటుప్పల్ మండలంలో తాను ఆశించిన ఓట్లు రాలేదని రాజగోపాల్ అంగీకరించారు.
అక్కడ మొదటి నుంచి బీజేపీకి భారీ మెజారిటీ వస్తుందనే ప్రచారం జరిగింది. కానీ వాస్తవ ఫలితాల్లోకి వచ్చే సరికి మెజారిటీ సంగతి ఏమో గాని అసలు ఆ మండలంలోని నాలుగు రౌండ్ల ఫలితాల తర్వాత టీఆర్ఎస్ నే ఆధిక్యాన్ని ప్రదర్శించడం గమనార్హం.
మునుగోడు టీఆర్ఎస్దే?.. ప్రజల మనోగతం ఇదే! (విధాత ప్రత్యేక సర్వే నిజమైంది)
ఇక్కడ తనకు వచ్చిన ఓట్లను చూసి రాజగోపాల్ కొంత నిరాశకు గురైనట్టు కనిపించింది. అందుకే ఫలితం తేలడానికి ఇంకా చాలా రౌండ్లు మిగిలి ఉన్నప్పటికీ నైతికంగా నేను గెలిచాను అని ఆయన ప్రకటించారు. ఆయన వ్యాఖ్యలపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి.
బీజేపీ అభ్యర్థి ఓటమిని అంగీకరించారని టీఆర్ఎస్ నేతలు కామెంట్ చేస్తుంటే చివరి రౌండ్ లోగా అయినా బీజేపీనే గెలుస్తుందని ఆ పార్టీ నేతలు వాదిస్తున్నారు. ప్రస్తుతం రౌండ్ల వారీగా వస్తున్న ఫలితాలు చూస్తుంటే బీజేపీ, టీఆర్ఎస్ల మధ్య టఫ్ ఫైట్ కొనసాగుతున్నది. మెజారిటీ కూడా రౌండ్ రౌండ్‌కు వంద ల్లోనే ఉంటున్నది. కాబట్టి చివరికి ఎవరు గెలిచినా స్వల్ప మెజారిటీనే అన్ని ప్రధాన పార్టీల నేతలు అంగీకరిస్తున్నారు.