Lamb | ఆ గొర్రె పిల్ల‌కు రూ.కోటి ఆఫ‌ర్.. తిర‌స్క‌రించిన య‌జ‌మాని

Lamb | గొర్రె పిల్ల‌కు కోటి రూపాయాల ఆఫ‌ర్ ఏంట‌ని ఆశ్చ‌ర్యం క‌ల‌గొచ్చు. ప‌ది, ప‌దిహేను వేల విలువ చేసే గొర్రె పిల్ల‌కు కోటి రూపాయాలు ఇచ్చి కొనుగోలు చేస్తామంటే య‌జ‌మాని ఎందుకు తిర‌స్క‌రిస్తున్నాడ‌నే ఆలోచ‌న కూడా రావొచ్చు. మ‌రి ఆ గొర్రెకు ఉన్న ప్ర‌త్యేక‌త ఏంటి..? ఎందుకు య‌జ‌మాని తిర‌స్క‌రిస్తున్నాడ‌నే విష‌యాలు తెలుసుకోవాలంటే రాజ‌స్థాన్ వెళ్లాల్సిందే. బ‌క్రీద్ పండుగ నేప‌థ్యంలో ముస్లింలు భారీగా గొర్రెల‌ను, మేక‌ల‌ను కొనుగోలు చేస్తుంటారు. అయితే రాజ‌స్థాన్‌లోని చురు జిల్లాలో ఉన్న […]

Lamb | ఆ గొర్రె పిల్ల‌కు రూ.కోటి ఆఫ‌ర్.. తిర‌స్క‌రించిన య‌జ‌మాని

Lamb | గొర్రె పిల్ల‌కు కోటి రూపాయాల ఆఫ‌ర్ ఏంట‌ని ఆశ్చ‌ర్యం క‌ల‌గొచ్చు. ప‌ది, ప‌దిహేను వేల విలువ చేసే గొర్రె పిల్ల‌కు కోటి రూపాయాలు ఇచ్చి కొనుగోలు చేస్తామంటే య‌జ‌మాని ఎందుకు తిర‌స్క‌రిస్తున్నాడ‌నే ఆలోచ‌న కూడా రావొచ్చు. మ‌రి ఆ గొర్రెకు ఉన్న ప్ర‌త్యేక‌త ఏంటి..? ఎందుకు య‌జ‌మాని తిర‌స్క‌రిస్తున్నాడ‌నే విష‌యాలు తెలుసుకోవాలంటే రాజ‌స్థాన్ వెళ్లాల్సిందే.

బ‌క్రీద్ పండుగ నేప‌థ్యంలో ముస్లింలు భారీగా గొర్రెల‌ను, మేక‌ల‌ను కొనుగోలు చేస్తుంటారు. అయితే రాజ‌స్థాన్‌లోని చురు జిల్లాలో ఉన్న ఓ గొర్రెను కొనుగోలు చేసేందుకు ముస్లింలు ఆస‌క్తి చూపిస్తున్నారు. ఆ గొర్రెను కొనుగోలు చేసేందుకు కోటి రూపాయాలు కూడా ఆఫ‌ర్ చేస్తున్నారు. కానీ దాని య‌జ‌మాని మాత్రం అమ్మేందుకు ఇష్ట‌ప‌డ‌టం లేదు. గొర్రెకు కోటి రూపాయాల ఆఫ‌ర్ వ‌చ్చింద‌ని చుట్టుప‌క్క‌ల గ్రామాల‌కు తెలియ‌డంతో.. తారాన‌గ‌ర్‌కు జ‌నాలు భారీగా త‌ర‌లివ‌స్తున్నారు. గొర్రెను ఆస‌క్తిగా తిల‌కిస్తున్నారు.

మ‌రి ఎందుకింత డిమాండ్..?

గ‌తేడాది జ‌న్మించిన ఆ గొర్రె పిల్ల శ‌రీరంపై ముస్లింలు పవిత్రంగా భావించే 786 నంబ‌ర్ ఉండ‌ట‌మే. బిస్మిల్లా ఇర్ ర‌హ్మ‌న్ ఇర్ ర‌హీంకు ప్ర‌తీక‌గా 786 రాస్తారు. దీంతో ఆ గొర్రెను ముస్లింలు పవిత్రంగా భావిస్తున్నారు. అందుకే ఆ గొర్రె పిల్ల‌కు కోటి రూపాయాలు ఆఫ‌ర్ చేశారు. కానీ య‌జ‌మాని మాత్రం అమ్మేందుకు ముందుకు రావ‌డం లేదు. ఈ గొర్రె త‌న‌కెంతో ఇష్ట‌మ‌ని చెప్పుకొచ్చాడు. ఈ గొర్రెను రూ. 70 ల‌క్ష‌ల‌కు అమ్మాల‌ని చాలా మంది అడుగుతున్నార‌ని, అమ్మ‌ను అని స్ప‌ష్టం చేశాడు.

గొర్రెకు ఆహారంగా దానిమ్మ‌, ప‌పాయ‌, మిల్లెట్స్‌, కూర‌గాయ‌లను సింగ్ ఆహారంగా అందిస్తున్నాడు. ఇక గొర్రె పిల్ల‌కు భారీ ధ‌ర ప‌ల‌క‌డంతో ముందు జాగ్ర‌త్త‌గా గొర్రె పిల్ల‌ను అత‌డు త‌న ఇంటి నుంచి బ‌య‌ట‌కు రాకుండా చూసుకుంటున్నాడు.