Ram Charan- Allu Arjun | చ‌ర‌ణ్- బ‌న్నీ మ‌ధ్య కోల్డ్ వార్‌లో నిజ‌మెంత‌.. బ‌య‌ట‌ప‌డ్డ సాక్ష్యం..!

Ram Charan- Allu Arjun | ఒక‌ప్పుడు మెగా ఫ్యామిలీలో ఒక‌డిగా ఉన్న అల్లు అర్జున్ ఇప్పుడు ఆ మెగా కాంపౌండ్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చేస్తున్నాడు. త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన అల్లుఅర్జున్ ఈ సినిమాతోనే నేష‌న‌ల్ అవార్డ్ అందుకున్నాడు. ఇప్ప‌టివ‌ర‌కు ఏ తెలుగు న‌టుడికి కూడా నేష‌న‌ల్ అవార్డ్ రాని నేప‌థ్యంలో బ‌న్నీకి ఈ అవార్డ్ ద‌క్క‌డం ప‌ట్ల ప్ర‌తి ఒక్క‌రు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. ఆయ‌న‌కి […]

  • By: sn    latest    Aug 26, 2023 9:15 AM IST
Ram Charan- Allu Arjun | చ‌ర‌ణ్- బ‌న్నీ మ‌ధ్య కోల్డ్ వార్‌లో నిజ‌మెంత‌.. బ‌య‌ట‌ప‌డ్డ సాక్ష్యం..!

Ram Charan- Allu Arjun |

ఒక‌ప్పుడు మెగా ఫ్యామిలీలో ఒక‌డిగా ఉన్న అల్లు అర్జున్ ఇప్పుడు ఆ మెగా కాంపౌండ్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చేస్తున్నాడు. త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన అల్లుఅర్జున్ ఈ సినిమాతోనే నేష‌న‌ల్ అవార్డ్ అందుకున్నాడు. ఇప్ప‌టివ‌ర‌కు ఏ తెలుగు న‌టుడికి కూడా నేష‌న‌ల్ అవార్డ్ రాని నేప‌థ్యంలో బ‌న్నీకి ఈ అవార్డ్ ద‌క్క‌డం ప‌ట్ల ప్ర‌తి ఒక్క‌రు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

ఆయ‌న‌కి ప్ర‌తి ఒక్క‌రు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. మెగా హీరోలు సాయి ధ‌ర‌మ్ తేజ్, వ‌రుణ్ తేజ్ అయితే ఇంటికెళ్లి మ‌రీ విష్ చేశారు. రామ్ చ‌ర‌ణ్ మాత్రం చాలా గ్యాప్ తీసుకొని త‌న శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. అందులో బ‌న్నీకి మొక్కుబ‌డిగా శుభాకాంక్ష‌లు చెప్పి త‌న న‌టించిన ఆర్ ఆర్ ఆర్ 6 అవార్డ్స్ గెలవడాన్ని హైలెట్ చేశాడు.

దీంతో రామ్ చ‌ర‌ణ్, అల్లు అర్జున్ మ‌ధ్య కోల్డ్ వార్ న‌డుస్తుంద‌ని అంద‌రు భావించారు. ఆ మ‌ధ్య రామ్ చరణ్ బర్త్ డేకి అల్లు అర్జున్ సోష‌ల్ మీడియా వేదికా ఎలాంటి పోస్ట్ పెట్ట‌లేదు. ఇక అల్లు అర్జున్ బర్త్ డే నాడు రామ్ చరణ్ విష్ చేసిన కూడా అదేదో పొడిపొడిగా విష్ చేశాడు.

ఈ ప‌రిణ‌మాల‌న్నీ చూసి నెటిజ‌న్స్ ఇద్ద‌రి మ‌ధ్య కోల్డ్ వార్ న‌డుస్తుంద‌ని అనుకుంటున్నారు. అయితే రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న దంప‌తులు బ‌న్నీకి ప్ర‌త్యేకంగా స్పెషల్ గిఫ్ట్‌గా ఓ బొకేను పంపి,ప్ర‌త్యేక‌మైన నోట్ కూడా జ‌త చేశారు. ఆ నోట్ లో డియర్ బన్నీ.. కంగ్రాట్స్.. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది.. ఇలాంటివి ఇంకా నీకు ఎన్నో రావాలి.. వస్తాయి అని రాసుకొచ్చారు.

దానికి బ‌న్నీ కూడా థాంక్యూ సో మచ్.. టచ్ చేశారు అన్నట్టుగా ఆ కామెంట్ పెట్టి తన ఇన్ స్టా స్టోరీలో షేర్ చేశాడు. దీంతో చెర్రీకి బన్నీకి గ్యాప్ ఉందనే ప్ర‌చారాల‌కి ఇది పులిస్టాప్ పెట్టిన‌ట్టు అయింది. ప్ర‌తి సారి కూడా ఇలా అల్లు ఫ్యామిలీకి, మెగా ఫ్యామిలీకి ప‌డ‌డం లేదంటూ పుకార్లు వ‌స్తున్నా కూడా వారు మాత్రం పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేదు.

అయితే ఇప్పుడు మెగా ఫ్యామిలీలో రామ్ చ‌ర‌ణ్‌కి, బ‌న్నీకి మాత్రం తీవ్ర‌మైన పోటీ ఉంద‌ని ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆర్ ఆర్ ఆర్ మూవీతో ఆస్కార్ వేడుకల్లో రామ్ చరణ్ పాల్గొన్న రామ్ చ‌ర‌ణ్‌.. కొన్ని గ్లోబల్ అవార్డ్స్ అందుకున్నాడు. ఇప్పుడు ఆయ‌న‌కి ధీటుగా అల్లు అర్జున్ నేషనల్ అవార్డు సాధించి టాలీవుడ్ చరిత్రలో ఈ ఘనత అందుకున్న మొదటి హీరోగా స‌రికొత్త రికార్డ్ సృష్టించాడు.