Rananaidu | ‘రానానాయుడు’.. మగాళ్లూ సిగ్గు పడాల్సిందే!

‘రానానాయుడు’.. రామానాయుడు పేరు పెంచారా.. చెడ‌గొట్టారా విధాత‌, సినిమా: హీరోలు, నటులకు ఇప్పుడు ఓటీటీ కొత్త మాధ్యమే వేదిక. సినిమా బిజినెస్‌ పరంగా కూడా ఓటీటీ కీలకంగా మారింది. దీంతో చాలామంది సెలబ్రిటీలు ఈ వేదిక ద్వారా తమ మూవీలను, వెబ్‌ సిరీస్‌లను విడుదల చేస్తున్నారు. ఈ మధ్య వెబ్‌సిరీస్‌ రానానాయుడు (Rananaidu) ఓటీటీలో విడుదలైంది. ఇది విడుదలకు ముందు వెంకటేశ్ (Venkatesh), రానా (Rana) కాంబోలో అనేసరికి ఆసక్తి పెరిగింది. వెంకటేశ్‌ ఫస్ట్‌ లుక్‌ మొదలు, […]

Rananaidu | ‘రానానాయుడు’.. మగాళ్లూ సిగ్గు పడాల్సిందే!

‘రానానాయుడు’.. రామానాయుడు పేరు పెంచారా.. చెడ‌గొట్టారా

విధాత‌, సినిమా: హీరోలు, నటులకు ఇప్పుడు ఓటీటీ కొత్త మాధ్యమే వేదిక. సినిమా బిజినెస్‌ పరంగా కూడా ఓటీటీ కీలకంగా మారింది. దీంతో చాలామంది సెలబ్రిటీలు ఈ వేదిక ద్వారా తమ మూవీలను, వెబ్‌ సిరీస్‌లను విడుదల చేస్తున్నారు. ఈ మధ్య వెబ్‌సిరీస్‌ రానానాయుడు (Rananaidu) ఓటీటీలో విడుదలైంది.

ఇది విడుదలకు ముందు వెంకటేశ్ (Venkatesh), రానా (Rana) కాంబోలో అనేసరికి ఆసక్తి పెరిగింది. వెంకటేశ్‌ ఫస్ట్‌ లుక్‌ మొదలు, ప్రమోషన్‌లో భాగంగా వచ్చిన ట్రైలర్‌లో ఆయన కొత్తగా కనిపించారు. దీంతో ఈ వెబ్‌ సిరీస్‌ ఆ మధ్య వచ్చిన ఫ్యామిలీ మెన్‌గా ఉంటుంది అనుకున్నారు.

వెంకటేశ్‌ అనగానే ఫ్యామిలీ హీరో ముద్ర ఉండనే ఉన్నది. ఫ్యామిలీ హీరోగానే కాకుండా అనేక కొత్త ప్రయోగాలు చేశారు. ప్రేమ, గణేశ్‌, ధర్మచక్రం లాంటి మూవీల్లో విక్టరీ తన నట విశ్వరూపం చూపారు. ఎఫ్‌-2 వంటి మూవీలతో తన కామెడీతో ఫ్యామిలీ ఆడియన్స్‌కు మరింత దగ్గరయ్యారు. రానా కూడా అంతే. మొదటి సినిమా లీడర్‌ మొదలు బాహుబలి, ఘాజీ, భీమ్లానాయక్‌, నేనే రాజు నేనే మంత్రి వంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నారు.

కానీ రానా నాయుడు చూసిన తర్వాత వెంకటేష్‌, రానాలు ఒక బోల్డ్, ఒక అడల్ట్‌ వెబ్‌సిరీస్ ఎలా ఒప్పుకున్నారు? ఎందుకు నటించారు అనే ప్రశ్నలు వచ్చాయి. ఎందుకంటే మొత్తం పది ఎపిసోడ్లు ఉన్న ఈ వెబ్‌ సిరీస్‌లో కథకు కనెక్ట్‌ అయ్యేవి కేవలం ఐదారు మాత్రమే. రెండు మూడు ఎపిసోడ్స్‌ కథాగమనాన్ని ముందుకు నడపడానికి దర్శకుడు రాసుకున్నట్టు కనిపిస్తుంది.

ప్రతీ ఎపిసోడ్‌లోనూ ఒక శృంగార సన్నివేశం (అసహజంగా అనిపిస్తుంది), పాత్రల మధ్య అక్రమ సంబంధాలు, వ్యవహారిక భాషలోనూ వాడలేని బూతులు అందులో జొప్పించారు. సినీ పరిశ్రమలో కొంతమంది డబ్బున్న వ్యక్తుల కుటంబ వ్యవహారాలన్నీ ఎలా నడుస్తాయి? తాము ఇష్టపడే వారితో ఎలా తిరుగుతారని తెలుసుకోవడానికి స్పై ఎలా ఉపయోగిస్తారు? ఒక గుట్టు మరొకరు రాబట్టడానికి రానా నాయుడు లాంటి వారు ఎలా పని చేస్తారు? వాళ్లకు డబ్బులు ఎలా అందుతాయనే విషయాలు దర్శకులు ఇంట్రెస్ట్ క్రియేట్‌ చేసేలా తీశారు.

కానీ ప్రతి ఎపిసోడ్‌లో వచ్చే శృంగార సన్నివేశాలు, బూతులు వింటే ఫ్యామీలి అంతా కలిసి చూసేలా అసల్సు లేదు. రానా నాయుడు తన తండ్రి నాగానాయుడు (వెంకటేశ్‌)ని ఎప్పుడూ ఎందుకు ద్వేషిస్తాడు అన్నది తొమ్మిదో ఎపీసోడ్‌ వరకు తెలియదు.

తండ్రికొడుకుల మధ్య బలమైన సంఘర్షణ ఎక్కడా లేదు. కానీ దర్శకులు శృంగార సన్నివేశాలు, బూతులతో చిన్నపిల్లలపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? ఫ్యామిలీతో కలిసి ఈ వెబ్‌ సిరీస్‌ చూడలేమని మొదటి ఎపిసోడ్‌తోనే తేలిపోతుంది.