రామ్ చరణ్ మెగా ప్లాన్.. రెండేండ్లలో ఆరు సినిమాలు
విధాత: మెగాస్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ ప్రస్తుతం పీక్స్ లో సాగుతోంది. మగధీరతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన రాంచరణ్ మరోసారిఆర్ఆర్ఆర్ చిత్రంతో దేశ విదేశాలలో క్రేజ్ను సంపాదించుకున్నాడు. ఈ చిత్రంలో ఆయన పోషించిన అల్లూరి సీతారామరాజు పాత్ర సినిమాకు హైలెట్ గా నిలిచింది. ఈ సినిమాని చూసిన పలువు పలువురు హాలీవుడ్ ప్రముఖులు,ఇతర దేశస్థులు కూడా రామ్ చరణ్ నటనను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇక రాజమౌళితో సినిమా వెంటనే మరో డిజాస్టర్ వస్తుందనేది […]

విధాత: మెగాస్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ ప్రస్తుతం పీక్స్ లో సాగుతోంది. మగధీరతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన రాంచరణ్ మరోసారిఆర్ఆర్ఆర్ చిత్రంతో దేశ విదేశాలలో క్రేజ్ను సంపాదించుకున్నాడు. ఈ చిత్రంలో ఆయన పోషించిన అల్లూరి సీతారామరాజు పాత్ర సినిమాకు హైలెట్ గా నిలిచింది. ఈ సినిమాని చూసిన పలువు పలువురు హాలీవుడ్ ప్రముఖులు,ఇతర దేశస్థులు కూడా రామ్ చరణ్ నటనను ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
ఇక రాజమౌళితో సినిమా వెంటనే మరో డిజాస్టర్ వస్తుందనేది చరణ్ కు రుజువయింది. చరణ్ ఆచార్య చిత్రంతో భారీ డిజాస్టర్ ను సొంతం చేసుకున్నాడు. ఆ సెంటిమెంటును దాటి ప్రస్తుతం తన 15వ చిత్రంగా దేశం గర్వించదగ్గ దర్శకుడు శంకర్తో దిల్ రాజు నిర్మాతగా ఓ పాన్ ఇండియా చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు రామ్ చరణ్ తన తదుపరి చిత్రాల ఎంపికలో మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ఆర్సి 15 చిత్రం మాత్రమే సెట్స్ పై ఉంది.
త్వరలో సుకుమార్ శిష్యుడు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. తాజాగా రామ్ చరణ్ గ్లోబల్ అవార్డ్స్ కోసం అమెరికా వెళ్ళాడు. అక్కడ తన తదుపరి ప్రాజెక్టులపై మీడియాకు ఒక క్లారిటీ ఇచ్చారు. 2023 అంటే ఈ ఏడాదిలో మూడు చిత్రాలు సైన్ చేశాను. 2024 లో మరో మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను అని చెప్పారు. అంటే మొత్తంగా రామ్ చరణ్ ఈ ఏడాది వచ్చే ఏడాది కలిపి ఆరు చిత్రాలను చేస్తున్నాడు అన్న విషయం అర్ధం అవుతుంది.
కానీ ప్రస్తుతం శంకర్ చిత్రంతోపాటు బుచ్చిబాబు చిత్రం మాత్రమే ఖరారయ్యాయి. మిగతా నాలుగు ప్రాజెక్టు ఎవరి దర్శకత్వంలో అనేది క్లారిటీ రావాల్సి ఉంది. కన్నడ డైరెక్టర్ నర్తన, కే జి ఎఫ్ ఎం ప్రశాంత్ నీల్, జెర్సీ ఫేమ్ గౌతమ్ తిననూరి వంటి వారితో కూడా ప్రాజెక్టు చేస్తానని రామ్ చరణ్ నాడు మాట ఇచ్చాడు. అలాగే ఆ లిస్టులో మరి కొంతమంది దర్శకులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. వారెవరో క్లారిటీ రావాల్సి వుంది..!