మరిన్ని షాకింగ్ విషయాలు బయటపెట్టిన రమ్య రఘుపతి విధాత: ఇటీవల సీనియర్ నరేష్ తన సహనటి పవిత్ర లోకేష్‌ను వివాహం చేసుకోబోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. చాలా కాలంగా వీరు సహజీవనం చేస్తున్నారు. ఇక నరేష్ తనకు వివాహం మీద నమ్మకం లేదంటూనే పవిత్ర లోకేష్‌ను నాలుగో వివాహం చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. దీంతో ఆయన మూడో భార్య రమ్య రఘుపతి మీడియా ముందుకు వచ్చి నరేష్ పై తీవ్రమైన ఆరోపణలు చేసింది. నా కొడుకు నాకు తండ్రి […]
మరిన్ని షాకింగ్ విషయాలు బయటపెట్టిన రమ్య రఘుపతి
విధాత: ఇటీవల సీనియర్ నరేష్ తన సహనటి పవిత్ర లోకేష్‌ను వివాహం చేసుకోబోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. చాలా కాలంగా వీరు సహజీవనం చేస్తున్నారు. ఇక నరేష్ తనకు వివాహం మీద నమ్మకం లేదంటూనే పవిత్ర లోకేష్‌ను నాలుగో వివాహం చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. దీంతో ఆయన మూడో భార్య రమ్య రఘుపతి మీడియా ముందుకు వచ్చి నరేష్ పై తీవ్రమైన ఆరోపణలు చేసింది. నా కొడుకు నాకు తండ్రి కావాలి అని అంటున్నాడు కాబట్టి నరేష్‌కు విడాకులు ఇచ్చే ప్రసక్తే లేదు అని ఆమె తేల్చి చెప్పింది. రమ్య రఘుపతి తాజాగా మరో ఇంటర్వ్యూలో పలు కీలక విషయాలకు సమాధానం ఇచ్చింది.
ఆయనకున్న వందల కోట్ల ఆస్తిపై మీరు కన్నేశారట.. ఆయన పేరును అప్పులు చేశారట కదా? అని ఎదురైన ప్రశ్నకు రమ్య రఘుపతి సమాధానం చెబుతూ.. ఆయన ఆస్తి నేను కోరుకోలేదు.. భార్యగా ఉండాలి అనుకున్నాను అంతే. డబ్బులు కావాలంటే విడాకులు ఇస్తే కోట్లు ఇవ్వడానికి నరేష్ సిద్ధంగా ఉన్నాడు అని కొందరు అంటున్నారు. మా మధ్య మనస్పర్ధలు ఉన్న మాట నిజమే చర్చల ద్వారా అవి పరిష్కారం చేయండి అని మాత్రమే నేను కోర్టులో పిటిషన్ వేశాను. విడాకులు కోరుకోలేదు.
అలాగే, ఆయన పేరు చెప్పి నేను అప్పులు చేశానన్నది నిజం కాదు. నా వ్యాపారం దెబ్బతినడంతో నేను కొన్ని అప్పులు చేశాను.. దానికి మా అమ్మగారి ప్లాట్ తాకట్టు పెట్టి లోన్ తీసుకున్నాను. సరే.. నేను చేసిన అప్పులకు ఆయన గ్యారంటీయర్గా ఏమైనా సంతకాలు చేశాడా? అంటే అదేం లేదు కదా!
నరేష్ హామీ ఉండి నాకు లోన్ ఇప్పించలేదు.. నాపై వచ్చిన ఆర్థిక నేరారోపణల వెనుక కూడా నరేష్ హస్తముంది. నేను నరేష్ దగ్గర డబ్బులు కోరుకోవడం లేదు.. కొడుకు మెయింటెనెన్స్ కోసం నెలకు 70000 ఇస్తున్నాడు. గతంలో 50,000 ఇచ్చేవాడు.. అది కూడా ఓ మూడేళ్ల నుంచి ఇస్తున్నాడు.
ప్రముఖులు చనిపోతే చివరి చూపు చూడని నాగార్జున! భయమా..లేక సెంటిమెంటా?
ఇన్ని గొడవలు జరిగిన నరేష్‌ని భర్తగా కోరుకోవడానికి ఒకే ఒక కారణం నా కొడుకు అతడిని తండ్రిని కోరుకుంటున్నాడు అని రమ్య రఘుపతి చెప్పుకొచ్చింది. ఇంకా మాట్లాడుతూ పవిత్ర లోకేష్, నరేష్.. నాకు విడాకులు మంజూరు కాకుండా పెళ్లి చేసుకుంటారని నేను అనుకోవడం లేదు.. అది చట్ట విరుద్ధమని వారికి తెలుసు అని సమాధానమిచ్చింది.