చనిపోయే వరకు.. మనుషులను చంపాలి: రష్మీ

ఈసారి నెటిజన్‌కి రష్మీ చాలా గట్టిగా ఇచ్చింది విధాత‌: ఒకనాడు బుల్లితెర యాంకర్ అంటే నిండుగా ఉండేవారు. సుమ, ఉదయభాను, ఝాన్సీ ఉన్నంతకాలం యాంకరింగ్‌ చాలా పద్ధతిగా నడిచింది. కానీ ఆ తర్వాతి తరంలో అనసూయ భరద్వాజ్, రష్మీ గౌతమ్ పుణ్యాన బుల్లితెరపై కూడా అందాల ఆరబోత మొదలయ్యింది. దీని ఫలితంగా అనసూయ భరద్వాజ్ ఎంతో పేరు సాధించి ఏకంగా వెండితెరపై అవకాశాలను చేజిక్కించుకుంటుంది. బుల్లితెరకు బై చెప్పి పూర్తిగా వెండితెరకు వెబ్ సిరీస్‌లకు పరిమితమైంది. దీని […]

  • By: krs    latest    Jan 19, 2023 8:24 AM IST
చనిపోయే వరకు.. మనుషులను చంపాలి: రష్మీ
  • ఈసారి నెటిజన్‌కి రష్మీ చాలా గట్టిగా ఇచ్చింది

విధాత‌: ఒకనాడు బుల్లితెర యాంకర్ అంటే నిండుగా ఉండేవారు. సుమ, ఉదయభాను, ఝాన్సీ ఉన్నంతకాలం యాంకరింగ్‌ చాలా పద్ధతిగా నడిచింది. కానీ ఆ తర్వాతి తరంలో అనసూయ భరద్వాజ్, రష్మీ గౌతమ్ పుణ్యాన బుల్లితెరపై కూడా అందాల ఆరబోత మొదలయ్యింది.

దీని ఫలితంగా అనసూయ భరద్వాజ్ ఎంతో పేరు సాధించి ఏకంగా వెండితెరపై అవకాశాలను చేజిక్కించుకుంటుంది. బుల్లితెరకు బై చెప్పి పూర్తిగా వెండితెరకు వెబ్ సిరీస్‌లకు పరిమితమైంది. దీని ద్వారా ఆదాయానికి ఆదాయం, క్రేజ్‌కి క్రేజ్ రెండు ఎక్కువ వస్తాయని ఆమె ఉద్దేశంగా కనిపిస్తోంది.

ఇక అనసూయ తరువాత జబర్దస్త్ షో ద్వారా అందరికీ పరిచయమైన రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె కూడా అనసూయకు పోటీగా తన గ్లామ‌ర్ షోతో మెప్పిస్తూ వస్తోంది. ఇక అనసూయ బుల్లితెరకు బై చెప్పడంతో బుల్లితెరపై రష్మీ గౌతమ్‌కు తిరుగులేకుండా ఉంది. వ‌రుస టాక్ షోలు చేస్తోంది.

ఎక్స్‌ట్రా జబర్ధస్త్‌ను ప్రస్తుతం ఈమె నడిపిస్తోంది. అయితే ఆమె కేవలం యాంకరే కాదు, నటి మరియు జంతు ప్రేమికురాలు కూడా. నటిగా ఇప్పటికే కొన్ని సినిమాలలో నటించిన రష్మీ.. సోషల్ మీడియా వేదికపై తను ఎంతగా జంతువులను ప్రేమిస్తూ ఉంటుందో తెలియజేస్తూ ఉంటుంది.

నోరులేని జీవాలను ఎవరైనా హింసిస్తే వారికి శిక్ష పడే వరకు పోరాటం చేస్తూ ఉంటుంది. ఇప్పటికే ఇలా నోరులేని జీవాలకు హాని చేసే వారిపై ఆమె తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తాజాగా సంక్రాంతి పండుగ సందర్భంగా కొన్ని ప్రాంతాలలో కోడి పందాలను ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు.

ఈ క్రమంలోనే ఒక డాక్టర్ సంక్రాంతి పండుగ సందర్భంగా రెండు సార్లు కోడి పందెం గెలిచానని ఈ పండుగను తాను ఎంజాయ్ చేస్తున్నానని సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని పంచుకున్నాడు. అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లను రష్మీ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ నీ డాక్టర్ సర్టిఫికెట్ తీసుకెళ్లి మురికి కాలువలో పడేయ్‌. ఇలా హింసను ప్రోత్సహిస్తారా అంటూ ట్వీట్ చేసింది. దాంతో చాలా సమయం ఈ విషయంపై డిబేట్ సాగింది.

అనంతరం ఒక నెటిజన్ ఈ విషయంపై స్పందిస్తూ కోడికి లేని బాధ మీకు ఎందుకు మేడం.. ఇది గర్వం కాదు.. మా సంప్రదాయం అంటూ స‌మాధానం ఇచ్చాడు. సదర్ నెటిజన్ ఇలా ట్వీట్ చేయడంతో రష్మీ మండిపడింది. కోడికి బాధ‌ లేదని నీకు తెలుసా..! అయినా మీరు మనుషుల మధ్య పోరాటాలు ఎందుకు పెట్టడం లేదు. గ్లాడియేటర్ పోరాటాలు సంప్రదాయాలలో భాగమే. వాటిని స్వీకరించి చనిపోయే వరకు మనుషులను చంపాలి అంటూ ట్వీట్ చేసింది.

వాస్తవానికి కోడిపందాలు కంటే తమిళనాడులో నిర్వహించే జల్లికట్టు కాస్త న‌యమని చెప్పాలి. అక్కడ మనుషులు తమ వీరత్వాన్ని ప్రదర్శించడం కోసం పశువులతో పోరాడుతారు. అందులో మరణిస్తారు కూడా. అలాంటి వాటికి పర్వాలేదు గానీ నోరులేని కోళ్ల మధ్య పందాలు పెట్టి వాటి ద్వారా సంతోషాన్ని నింపుకోవడం సరైన పద్ధతి కాదని చెప్పాలి. ఈ విషయంలో రష్మీ‌ని సపోర్ట్ చేసే వారు కూడా లేకపోలేదు. దీంతో ఆమె సోషల్ మీడియాలో మరోసారి ట్రెండ్ అయ్యింది.