Rashmi | సెక్స్, డేటింగ్ గురించి రష్మీ బోల్డ్ కామెంట్స్.. షాక్ అవుతున్న నెటిజన్స్
Rashmi: ప్రస్తుతం టాలీవుడ్ టాప్ యాంకర్స్ లో రష్మీ గౌతమ్ కూడా ఒకరు. మొదట్లో సినిమాలలో నటించిన రష్మీకి పెద్దగా కలిసి రాకపోవడంతో బుల్లితెరపై అడుగుపెట్టింది. జబర్దస్త్ షో తో క్రేజీ యాంకర్ గా గుర్తింపు పొందింది రష్మీ గౌతమ్.. ఇప్పుడు బుల్లితెరపైనే యాంకర్ గా కొనసాగిస్తూ.. ఆడప దడపా సినిమాలలో నటిస్తుంది. ఇక బుల్లితెర మీద రష్మీ , సుదీర్ జంటకు మంచి క్రేజ్ ఉంది. వీరిద్దరు ప్రేమలో ఉన్నారని పెళ్లి చేసుకోబోతున్నారని ఇప్పటికీ ఏదో […]

Rashmi: ప్రస్తుతం టాలీవుడ్ టాప్ యాంకర్స్ లో రష్మీ గౌతమ్ కూడా ఒకరు. మొదట్లో సినిమాలలో నటించిన రష్మీకి పెద్దగా కలిసి రాకపోవడంతో బుల్లితెరపై అడుగుపెట్టింది. జబర్దస్త్ షో తో క్రేజీ యాంకర్ గా గుర్తింపు పొందింది రష్మీ గౌతమ్.. ఇప్పుడు బుల్లితెరపైనే యాంకర్ గా కొనసాగిస్తూ.. ఆడప దడపా సినిమాలలో నటిస్తుంది.
ఇక బుల్లితెర మీద రష్మీ , సుదీర్ జంటకు మంచి క్రేజ్ ఉంది. వీరిద్దరు ప్రేమలో ఉన్నారని పెళ్లి చేసుకోబోతున్నారని ఇప్పటికీ ఏదో ఒక ప్రచారం జరుగుతూనే ఉంటుంది. ఒకప్పుడు కలిసి కనిపించిన సుధీర్, రష్మీ ఇప్పుడు విడివిడిగా సందడి చేస్తున్నారు. అయితే రష్మీ ఇటు బుల్లితెర అటు సోషల్ మీడియాలో సందడి చేయడమే కాకుండా సమాజంపై చాలా బాధ్యతగా వ్యవహరిస్తూ ఉంటుంది.
జంతు ప్రేమికురాలు అయిన రష్మీ.. ఎక్కడ జంతు హింస జరిగిన, వాటి గురించి ఎలాంటి వార్త వచ్చిన కూడా వెంటనే వాటిపైన స్పందిస్తూ సోషల్ మీడియాలో పలు రకాల పోస్టులు షేర్ చేస్తూ ఉంటుంది. అలానే తాను చెప్పాలనుకున్న విషయాన్ని ఎలాంటి మొహమాటం లేకుండా చెబుతుంది.
తాజాగా తన ఇన్‌స్టా స్టోరీలో సెక్స్, డేటింగ్ గురించి బోల్డ్ పోస్ట్ ఒకటి పెట్టి అందరు నోరెళ్లపెట్టేలా చేసింది. శృంగారపరమైన దృశ్యాలు ఒక సైకిల్లా ఉన్న ఫోటో షేర్ చేసిన ఈ అమ్మడు డేటింగ్ సాంప్రదాయం వల్ల జరుగుతున్నది ఇదే అని చెప్పింది. చాలా మంది సంబంధాలు వావి వరసలు మరచిపోయి శృంగారాన్ని అనుభవించడంలో బిజీ అయ్యారంటూ రష్మీ పోస్ట్ పెట్టింది.
నిజమైన ప్రేమని పొందమని దేవుడు మనని సన్మార్గంలో పంపుతుంటే మనం మాత్రం రాక్షసత్వమైన శృంగార కోరికలతో ప్రేమను తిరస్కరిస్తున్నారు విషపూరితమైన సంబంధాలు మన చుట్టూ ఒక సైకిల్ లా తిరుగుతున్నాయి అని రష్మీ గౌతమ్ తన పోస్ట్‌లో రాసుకొచ్చింది.
ఇక ఈ అమ్మడు షేర్ చేసిన ఈ పోస్టును చాలా మంది నేటిజన్స్ ఏకీభవిస్తుండగా, మరి కొందరు మాత్రం మతపరమైన అంశాల గురించి తరచూ మాట్లాడుతూ ఉంటుంది అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. ఏది ఏమైన కూడా ఇప్పుడు రష్మి షేర్ చేసిన ఈ ఇంస్టాగ్రామ్ స్టోరీ వైరల్ గా మారుతోంది