ఎవరు మరొకరిని భర్తీ చేయలేరు.. టాటూపై రష్మిక వివరణ..!

విధాత‌: అతి తక్కువ కాలంలోనే స్టార్ హోదాను సాధించుకున్న హీరోయిన్లలో రష్మిక మందన పేరు ముందుగా చెప్పుకోవాలి. కన్నడ సినిమాలలో కిర్రాక్ పార్టీ అనే చిత్రంతో ప‌రిచ‌య‌మైన ఈమె ఆ త‌ర్వాత క‌న్న‌డ‌లో చిన్న సినిమాలు చేసింది. ఈమె తెలుగులో వెంకీ కుడుముల దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా వచ్చిన చలో చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత గీతగోవిందంతో బ్లాక్ బస్టర్ హిట్ నందించుకుంది. దేవదాసు చిత్రం పరవాలేదు అనిపించింది. డియర్ కామ్రేడ్ చిత్రం సరిగా […]

  • By: krs    latest    Jan 16, 2023 4:20 PM IST
ఎవరు మరొకరిని భర్తీ చేయలేరు.. టాటూపై రష్మిక వివరణ..!

విధాత‌: అతి తక్కువ కాలంలోనే స్టార్ హోదాను సాధించుకున్న హీరోయిన్లలో రష్మిక మందన పేరు ముందుగా చెప్పుకోవాలి. కన్నడ సినిమాలలో కిర్రాక్ పార్టీ అనే చిత్రంతో ప‌రిచ‌య‌మైన ఈమె ఆ త‌ర్వాత క‌న్న‌డ‌లో చిన్న సినిమాలు చేసింది. ఈమె తెలుగులో వెంకీ కుడుముల దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా వచ్చిన చలో చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.

ఆ తరువాత గీతగోవిందంతో బ్లాక్ బస్టర్ హిట్ నందించుకుంది. దేవదాసు చిత్రం పరవాలేదు అనిపించింది. డియర్ కామ్రేడ్ చిత్రం సరిగా ఆడలేదు. ఇంకా ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో స‌రిలేరు నీకెవ్వరు అనే చిత్రంలో నటించింది.

నితిన్‌తో భీష్మ.. ప్రస్తుతం బన్నీతో పుష్ప1లో నటించింది. పుష్పా చిత్రంతో శ్రీవల్లిగా మారిన ఈమెను అభిమానించే ప్రేక్షకుల సంఖ్య దక్షిణాదిలో బాగానే పెరుగుతుంది. తాజాగా ఈమె కోలీవుడ్ స్టార్ విజయ్ నటించిన వారిసు చిత్రంలో నటించింది. ఈ చిత్రం తెలుగులో వారసుడిగా డ‌బ్ అయిన సంగతి తెలిసిందే.

ప్ర‌స్తుతం పుష్ప‌2గా రూపొందుతున్న పుష్పా ది రూల్ చిత్రంలో న‌టిస్తోంది. పాన్ ఇండియా, పాన్ వ‌ర‌ల్డ్ రేంజ్‌లో ఈ చిత్రం రూపొందుతోంది. అలాంటి ఈమె సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలతో ఆకట్టుకుంటూ ఉంటుంది.

తాజాగా తన చేతిపై ఉండే టాటూ గురించి తెలిపింది. ఇందులో ఆమె తన చేతి పై ఇర్రిప్లేస‌బుల్ అనే టాటూ కనిపిస్తుంది. దీని గురించి ఆమె మాట్లాడుతూ నాకు మొదట టాటూ వేయించుకోవాలని ఉండేది కాదు. కానీ కాలేజీలో ఒక అబ్బాయి అమ్మాయిలు, ఆడపిల్లలు బాధను ఓర్చుకోలేరు. వాళ్లకు సూదులు అన్న భయమేనని అన్నాడు.

అది తప్పు అని నిరూపించాలని నేను టాటూ వేయించు కోవాలని నిర్ణయించుకున్నా కానీ ఏం వేయించు కోవాలో తెలియలేదు. చాలా సేపు ఆలోచించాక నాకు ఒక ఆలోచన వచ్చింది. ఎవరు మరొకరిని భర్తీ చేయలేర‌ని నేను అనుకుంటాను. ప్రతి ఒక్కరూ ముఖ్యమైన వారే. ఇదే అర్థం వచ్చేలా ఇర్రిప్లేసబుల్ అనే పదాన్ని వేయించుకున్నాను అని చెప్పుకొచ్చింది.