Rashmika: మరోసారి అడ్డంగా బుక్కైన రష్మిక.. విజయ్ దేవరకొండ షర్ట్ వేసుకొని రచ్చ
Rashmika: సెలబ్రిటీల మధ్య స్నేహం ఏర్పడడం, ఆ స్నేహం కొద్ది రోజులకి ప్రేమగా మారడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే కొందరు తమ ప్రేమని బహిర్గతం చేసిన మరి కొందరు మాత్రం సీక్రెట్‌గా ప్రేమాయణం నడిపిస్తుంటారు. గత కొద్ది రోజులుగా విజయ్ దేవరకొండ- రష్మికల మధ్య సీక్రెట్ లవ్ నడుస్తుందని జోరుగా ప్రచారాలు సాగుతున్నప్పటికీ వారిద్దరు స్పందించడం లేదు. కాని నెటిజన్స్ మాత్రం అనేక సాక్ష్యాలని చూపిస్తూ ఈ ఇద్దరు పీకల్లోతు ప్రేమలో ఉన్నారని చెబుతున్నారు. తాజాగా రష్మిక […]

Rashmika: సెలబ్రిటీల మధ్య స్నేహం ఏర్పడడం, ఆ స్నేహం కొద్ది రోజులకి ప్రేమగా మారడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే కొందరు తమ ప్రేమని బహిర్గతం చేసిన మరి కొందరు మాత్రం సీక్రెట్‌గా ప్రేమాయణం నడిపిస్తుంటారు. గత కొద్ది రోజులుగా విజయ్ దేవరకొండ- రష్మికల మధ్య సీక్రెట్ లవ్ నడుస్తుందని జోరుగా ప్రచారాలు సాగుతున్నప్పటికీ వారిద్దరు స్పందించడం లేదు. కాని నెటిజన్స్ మాత్రం అనేక సాక్ష్యాలని చూపిస్తూ ఈ ఇద్దరు పీకల్లోతు ప్రేమలో ఉన్నారని చెబుతున్నారు. తాజాగా రష్మిక వేసుకున్న షర్ట్ విజయ్ దేవరకొండదని చెబుతూ.. ఈ ఇద్దరి మధ్య ప్రేమ ఉందని, ఇంతకన్నా ఏమి సాక్ష్యం కావాలని కొందరు కామెంట్ చేస్తున్నారు. గతంలో విజయ్ దేవరకొండ ఇలాంటి షర్ట్ వేసుకుని కనిపించగా, ఇప్పుడు రెండు ఫోటోలు ఒకదానికొకటి లింక్ చేసి వైరల్ చేస్తున్నారు.
విజయ్ దేవరకొండ, రష్మిక ‘గీతా గోవిందం’ చిత్రంలో మొదటిసారి కలిసి నటించారు. ఈ చిత్రంలో ఇద్దరి కెమిస్ట్రీ అదిరిపోయింది. ఇక ఆ తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక కలిసి ‘డియర్ కామ్రేడ్’లో నటించారు. ఇక ఈ సినిమా నుండి ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడడం, సినిమాల్లో కలిసి చేయకపోయినా ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తూ వెకేషన్స్‌కి వెళ్లడం, ఒకరి ఫంక్షన్స్ కి ఒకరు హాజరు కావడం వంటివి చేస్తున్నారు. మరోవైపు విజయ్ ఫ్యామిలీతో రష్మిక చాలా క్లోజ్‌గా మూవ్ అవుతుండడం చూసి వీరిద్దరు ప్రేమలో ఉన్నారని చెప్పుకొస్తున్నారు.
తాజాగా రష్మిక ఎయిర్ పోర్ట్‌లో ప్రత్యక్షం కాగా, ఆమె చెక్స్ డిజైన్ కలిగిన షర్ట్ ధరించి ఉంది. ఇదే షర్ట్‌తో విజయ్ దేవరకొండ ఓ సారి ఎయిర్‌పోర్ట్‌లో కనిపించాడు. దీంతో రష్మిక ధరించిన షర్ట్ విజయ్‌దేనని వాదిస్తున్న నెటిజన్లు.. మొత్తానికి వాళ్లిద్దరి మధ్య రిలేషన్‌షిప్ ఇలా బయటపడింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. విజయ్ లాంటి షర్ట్ రష్మిక కొనుగోలు చేసిందా ? లేదంటే విజయ్ తన షర్ట్‌ను రష్మికకు ఇచ్చాడా? అని తెగ చర్చలు మొదలు పెట్టారు. మరి వీరిద్దరి మధ్య ఉన్న రిలేషన్‌పై ఎప్పుడు పూర్తి క్లారిటీ వస్తుందో చూడాలి. ఇక విజయ్ దేవరకొండ సినిమాల విషయానికొస్తే.. ‘ఖుషి’ షూటింగ్ ఇప్పటికే పూర్తి చేయగా, పరశురాం దర్శకత్వంలో ఒక సినిమాతో పాటు గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో మరొక సినిమా చేయనున్నాడు. మరోవైపు రష్మిక.. ‘యానిమల్, పుష్ప 2’ తదితర చిత్రాలతో బిజీగా ఉంది.