Rat attack: వ‌రంగ‌ల్ కాక‌తీయ యూనిర్సిటీలో ఎలుక‌ల దాడి.. విద్యార్థినుల‌కు తీవ్ర గాయాలు

Rat attack, Warangal, Kakatiya University విధాత: వ‌రంగ‌ల్ (Warangal) కాక‌తీయ యూనివ‌ర్సిటీ (Kakatiya University) లో ఎలుక‌ల దాడి(Rat attack) వెలుగు చూసింది. తమ హాస్ట‌ల్ గ‌దుల్లో నిన్న రాత్రి నిద్రిస్తున్న విద్యార్థినుల‌పై ఎలుక‌లు దాడి చేశాయి. అమ్మాయిల కాళ్ల‌కు తీవ్ర గాయాల‌య్యాయి. దీంతో వారిని చికిత్స నిమిత్తం యూనివ‌ర్సిటీ హెల్త్ సెంట‌ర్‌కు తోటి విద్యార్థినులు త‌ర‌లించారు. యూనివ‌ర్సిటీ పాల‌క వ‌ర్గంపై విద్యార్థినులు మండి ప‌డుతున్నారు. హాస్ట‌ళ్ల‌లో క‌నీస సౌక‌ర్యాలు క‌ల్పించ‌డం లేద‌ని వారు ఆవేద‌న […]

  • By: krs    latest    Mar 07, 2023 6:18 AM IST
Rat attack: వ‌రంగ‌ల్ కాక‌తీయ యూనిర్సిటీలో ఎలుక‌ల దాడి.. విద్యార్థినుల‌కు తీవ్ర గాయాలు

Rat attack, Warangal, Kakatiya University

విధాత: వ‌రంగ‌ల్ (Warangal) కాక‌తీయ యూనివ‌ర్సిటీ (Kakatiya University) లో ఎలుక‌ల దాడి(Rat attack) వెలుగు చూసింది. తమ హాస్ట‌ల్ గ‌దుల్లో నిన్న రాత్రి నిద్రిస్తున్న విద్యార్థినుల‌పై ఎలుక‌లు దాడి చేశాయి. అమ్మాయిల కాళ్ల‌కు తీవ్ర గాయాల‌య్యాయి. దీంతో వారిని చికిత్స నిమిత్తం యూనివ‌ర్సిటీ హెల్త్ సెంట‌ర్‌కు తోటి విద్యార్థినులు త‌ర‌లించారు.

యూనివ‌ర్సిటీ పాల‌క వ‌ర్గంపై విద్యార్థినులు మండి ప‌డుతున్నారు. హాస్ట‌ళ్ల‌లో క‌నీస సౌక‌ర్యాలు క‌ల్పించ‌డం లేద‌ని వారు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఎలుక‌లు హాస్ట‌ల్ గ‌దుల్లోకి ప్ర‌వేశించి పుస్త‌కాల‌ను, దుస్తుల‌ను పాడు చేస్తున్నాయ‌ని తెలిపారు.

నిన్న రాత్రి ఏకంగా త‌మ కాళ్ల‌ను కొరికి తీవ్రంగా గాయ‌ప‌రిచాయ‌ని పేర్కొన్నారు. హాస్ట‌ళ్ల‌లో నిద్రించా లంటేనే భ‌య‌మేస్తోంద‌ని విద్యార్థినులు వ‌ర్సిటీ అధికారులపై మండిప‌డ్డారు.