హోరాహోరీగా నామినేషన్స్.. ఈ సారి హౌజ్ నుండి ఎవరు బయటకు వెళ్లనున్నారు

గత సీజన్‌లో సోమవారం నామినేషన్ ప్రక్రియ జరగడం మనం చూశాం. ఆ రోజు హౌజ్ దద్దరిల్లిపోయేది. ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణులు చేసుకుంటూ రచ్చ చేసేవాళ్లు. అయితే ఈ సీజన్‌లో సోమ, మంగళవారాలలో ఈ నామినేషన్ ప్రక్రియ జరుగుతూ వస్తుంది. సోమవారం ఎపిసోడ్‌లో రతికా రోజ్, ప్రియాంక నామినేషన్ కాగా, మంగళవారం ఎపిసోడ్‌లో మరికొందరు నామినేట్ అయ్యారు.
ఈ నామినేషన్ ప్రక్రియలో గౌతమ్, యావర్ మధ్య పెద్ద డిస్కషనే నడిచింది. గౌతమ్ కృష్ణ జజ ప్రిన్స్ యావర్ ని బోనులో నిలబెట్టి నామినేట్ చేయగా, ఆ సమయంలో గౌతమ్ చెప్పిన పాయింట్ శివాజీకి నచ్చ లేదు.
దాంతో గౌతమ్‌తో ఆయన వాదిస్తుండగా, చిర్రెత్తుకొచ్చిన గౌతమ్ చేతిలోని గొడుగు నెలకొసి కొట్టి.. యావర్ అన్న మాటలకు చచ్చిపోవాలనిపిస్తోందంటూ మైక్ తీసి పడేశాడు. ఒకానొక సమయంలో శివాజీ మీదకు గౌతమ్ నువ్వు ఎవరంటూ ఆవేశంతో దూసుకుపోయాడు.
అయితే జ్యూరీ సభ్యులు ప్రిన్స్ యావర్‌ని నామినేట్ చేయగా, ఆ తర్వాత వచ్చిన అమర్ దీప్.. పల్లవి ప్రశాంత్, శుభశ్రీలను నామినేట్ చేశాడు. పల్లవి ప్రశాంత్ కి రెండు ముఖాలు ఉన్నాయని, ఒరిజినాలిటీ బయటకు తీసుకురావాలని అన్నాడు అమర్. ఇక ప్రియాంక కంటెండర్ గా నాట్ ఎలిజిబుల్ అని అమర్ దీప్ నామినేట్ చేస్తే… నువ్వు డిఫెండ్ చేసుకోలేకపోయావ్, గేమ్ ఆడలేదని అమర్ దీప్ ని నామినేట్ చేసింది.
ఆ పాయింట్ ని ని రివర్స్ చేసి అమర్ దీప్ ..శుభశ్రీని నామినేట్ చేయడం… జ్యూరీ సభ్యులు కూడా అంగీకరించడంతో శుభశ్రీ చాలా ఎమోషన్ అయింది. ఇలాంటి రీజన్‌తో నామినేట్ చేయడం సరికాదని అని పేర్కొంది.ఇక గౌతమ్ కృష్ణను పల్లవి ప్రశాంత్ నామినేట్ చే స్తూ…శోభా శెట్టి ముందు చొక్కా విప్పడం నచ్చలేదన్నాడు.
ప్రశాంత్ మాటలకి గౌతమ్ .. రతికాని లైన్‌లోకి తెచ్చి నువ్వు రతికా బట్టల మీద కామెంట్ చేయలేదా అని అడిగాడు. ఇంత పొట్టి బట్టలు ఎందుకు ధరిస్తుందని అన్నావా లేదా అని అన్నప్పుడు రతికా.. నా బట్టల మీద కామెంట్ చేయడానికి నువ్వు ఎవడు అంటూ బుస్సున లేచింది. నా ప్రాపర్టీ అనే పదం ఎలా వాడతావు. నోటికి వచ్చింది వాగొద్దని అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది రతిక.
అప్పుడు ఫ్రెండ్ అని మజాక్ చేశా అని ప్రశాంత్ అంటే.. నాతో నీకు మజాక్ ఏంటి? నువ్వు అసలు ఎవడ్రా బాయ్? అంటూ పల్లవి ప్రశాంత్ ని ఏకిపారేసింది. వాదనల తర్వాత రతికని అక్క అని అనేశాడు ప్రశాంత్. మొత్తంగా హోరా హోరీగా వాదనలు పూర్తయ్యాక ప్రియాంక, రతికా రోజ్, ప్రిన్స్ యావర్, గౌతమ్ కృష్ణ, శుభశ్రీ నామినేట్ అయ్యారు.
అనంతరం అమర్ దీప్, పల్లవి ప్రశాంత్, తేజాలలో ఒకరిని నామినేట్ చేయాలనీ జ్యూరీ సభ్యులను కోరగా, సందీప్, శివాజీ కలిసి.. తేజాను ఎంపిక చేయగా, తేజాను తప్పించేందుకు జ్యూరీ మెంబర్ గా ఉన్న శోభా ఎంతో ప్రయత్నం చేసినప్పటికీ అతను నామినేషన్‌లో వచ్చి చేరాడు. దీంతో ఈ వారం తేజకి లైఫ్ అండ్ డెత్ అని చెప్పాలి. ఈ వారం ఎలిమినేట్ కావడం గ్యారెంటీ అని అంటున్నారు.