RBI | కొత్త పేమెంట్‌ సిస్టమ్‌ను తీసుకొస్తున్న ఆర్‌బీఐ..! మనీ ట్రాన్స్‌ఫర్‌ మరింత ఈజీగా..!

RBI | రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కొత్త పేమెంట్‌ సిస్టమ్‌ను తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నది. లైట్ వెయిట్ పోర్టబుల్ పేమెంట్ సిస్టమ్‌ డెవలప్‌మెంట్‌ పని చేస్తున్నది. ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధ పరిస్థితుల్లోనూ కీలక లావాదేవీల కోసం పేవ్‌మెంట్‌ సిస్టమ్‌ను ఉపయోగించు కునేందుకు అవకాశం ఉంది. ప్రతిపాదిత లైట్ వెయిట్ పోర్టబుల్ పేమెంట్ సిస్టమ్ (LPSS) సాంప్రదాయ సాంకేతికతతో సంబంధం లేకుండా పని చేస్తుందని ఆర్‌బీఐ వర్గాలు తెలిపాయి. కొంతమంది ప్రత్యేక ఉద్యోగులు ఈ వ్యవస్థను ఎక్కడైనా ఆపరేట్ […]

RBI | కొత్త పేమెంట్‌ సిస్టమ్‌ను తీసుకొస్తున్న ఆర్‌బీఐ..! మనీ ట్రాన్స్‌ఫర్‌ మరింత ఈజీగా..!

RBI | రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కొత్త పేమెంట్‌ సిస్టమ్‌ను తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నది. లైట్ వెయిట్ పోర్టబుల్ పేమెంట్ సిస్టమ్‌ డెవలప్‌మెంట్‌ పని చేస్తున్నది.

ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధ పరిస్థితుల్లోనూ కీలక లావాదేవీల కోసం పేవ్‌మెంట్‌ సిస్టమ్‌ను ఉపయోగించు కునేందుకు అవకాశం ఉంది. ప్రతిపాదిత లైట్ వెయిట్ పోర్టబుల్ పేమెంట్ సిస్టమ్ (LPSS) సాంప్రదాయ సాంకేతికతతో సంబంధం లేకుండా పని చేస్తుందని ఆర్‌బీఐ వర్గాలు తెలిపాయి.

కొంతమంది ప్రత్యేక ఉద్యోగులు ఈ వ్యవస్థను ఎక్కడైనా ఆపరేట్ చేయవచ్చని పేర్కొంది. ఇప్పటి వరకు ఐటీపై ఆధారపడి పని చేస్తాచి. ప్రస్తుతం చెల్లింపుల కోసం అమలవుతున్న ఆర్‌టీజీసీ (RTGS), నెఫ్ట్‌ (NEFT), యూపీఐ (UPI) సేవలతో పెద్ద మొత్తంలో చెల్లింపులను చేసేందుకు ఆర్‌బీఐ రూపొందించింది.

ఈ చెల్లింపు వ్యవస్థలు అధునాతన ఐటీ మౌలిక సదుపాయాలపై పని చేస్తాయి. ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధం సంభవించినప్పుడు అంతర్లీన సమాచారం, కమ్యూనికేషన్ మౌలిక సదుపాయాలకు అంతరాయం కలిగిన సమయాల్లో ఇవి పని చేయవు.

దాంతో చెల్లింపులు మాత్రం జరుగవు. ఇలాంటి సమయాల్లో క్తొత చెల్లింపు వ్యవస్థలను అందుబాటులోకి ఆర్‌బీఐ పేర్కొంది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడంతో పాటు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఉపయోగించ గలిగే ఇలాంటి వ్యవస్థను ఆర్‌బీఐ తీసుకురానున్నది. ఇది సాంప్రదాయ సాంకేతికత నుంచి స్వతంత్రంగా ఉండనున్నది. తక్కువ సంఖ్యలో ఉద్యోగులు ఎక్కడి నుంచైనా ఈ సేవలను ఆపరేట్ చేసేందుకు అవకాశం ఉంది.