బికినీలో సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న బ్యూటీ.. కేక పెట్టించే లుక్‌లో క‌ట్టిప‌డేస్తుందిగా..!

  • By: sn    latest    Sep 23, 2023 8:02 AM IST
బికినీలో సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న బ్యూటీ.. కేక పెట్టించే లుక్‌లో క‌ట్టిప‌డేస్తుందిగా..!

తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టే అందాల ముద్దుగుమ్మ‌లు న‌ట‌న‌తోనే కాకుండా గ్లామ‌ర్‌తోను క‌ట్టి ప‌డేస్తున్నారు. కవ్వించే అందాల షోతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టేస్తున్న అందాల ముద్దుగుమ్మ‌ రెబా మోనికా జాన్… ప్ర‌స్తుతం వ‌రుస ఆఫ‌ర్స్‌తో దూసుకుపోతుంది. త‌న సొగ‌సైన అంద‌చందాల‌తో కుర్రాళ్ల‌కి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. జాకోబింటే స్వర్గరాజ్యం మూవీతో సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చిన రెబా.. ఇటీవల సామజవరగమన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మ‌రింత దగ్గరైంది. ఇక‌ సోషల్ మీడియాలో ప్ర‌కంప‌న‌లు పుట్టిస్తూ కాక రేపుతుంది. ఈ అమ్మ‌డు షేర్ చేసిన పిక్స్ నెట్టింట తెగ వైర‌ల్ అవుతుంటాయి. ఈ అందాల ముద్దుగుమ్మ ఫ్రెండ్స్‌తో క‌లిసి థాయ్‌లాండ్ వెళ్లింది. అక్క‌డ ఫ్రెండ్స్‌తో చిల్ అవుతుంది. ఇక అక్కడ బీచ్‌లో బికినీలో రచ్చ చేసింది. అక్కడ తీసుకున్న పిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి.

రెబాని ఇలా చూసి కుర్రకారు కూడా మైమ‌ర‌చిపోతున్నారు. ఏమా అందంరా బాబు మెంట‌లెక్కిస్తుందిగా అంటూ కొంద‌రు నాటీ కామెంట్స్ చేస్తున్నారు. సినిమాలో కాస్త ప‌ద్ద‌తిగా క‌నిపించిన ఈ ముద్దుగుమ్మ సోష‌ల్ మీడియాకి వ‌చ్చే స‌రికి త‌న క్యూట్ అందాల‌తో వేడి పుట్టిస్తుండ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇక రెబాపై ఓ సారి అల్లు అర్జున్ కూడా ప్ర‌శంస‌లు కురిపించారు.శ్రీవిష్ణు నటించిన సామజవరగమన సినిమాపై ప్రశంసలు కురిపించిన బన్నీ.. చిత్రంలో కథానాయికగా న‌టించిన‌ రెబా మోనికా జాన్‏ను నా మలయాళీ భామా అంటూ ప్రస్తావించారు.దాంతో ఆమె పేరు ట్రెండింగ్‌లో నిలిచింది.

రెబా మోనికా 1994 ఫిబ్రవరి 4న బెంగుళూరులో జన్మించింది.క్రిస్ట్ యూనివర్సిటీలో గ్రాడ్యూయేషన్ పూర్తిచేసిన త‌ర్వాత మోడలింగ్ రంగంలోకి వ‌చ్చింది. 2016లో జాకోబిన్ట్ స్వర్గరాజ్యం సినిమాతో సినీ ప‌రిశ్ర‌మ‌లో అడుగుపెట్టిన రెబా మోనికా… ఆ తర్వాత మలయాళం, తమిళ్ సినిమాల్లో పలు చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ప్ర‌స్తుతం ఆఫ‌ర్స్ బాగానే అందుకుంటుంది. అప్పుడ‌ప్పుడు సోష‌ల్ మీడియాలో త‌న క్యూట్ పిక్స్ షేర్ చేస్తూ ఉంటుంది. అవి నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటూ ఉంటాయి.