ఉద్యోగుల తొలగింపు.. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తీరుపై విమర్శలు
విధాత: రైల్వే రంగాన్ని ప్రక్షాళన చేస్తానని చెప్పుకొంటున్న రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఉద్యోగుల గోస పుచ్చుకొంటున్నారు. సంతృప్తికర పని విధానం లేదని, అవినీతి, అలసత్వం పేరుకు పోయిందని, తదితర కారణాలతో ఏకంగా ఉద్యోగం నుంచే తొలగిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలొస్తున్నాయి. రైల్వేలను బాగు పర్చాలంటే.. అనేక సంస్కరణలు చేపట్టాలి. రైళ్ల నిర్వహణ, రైల్వే స్టేషన్ల పరిశుభ్రత, నిర్వహణ విషయంలో సకల సదుపాయాలు, ఆధునిక టెక్నాలజీతో అభివృద్ధి చేయాలి. సేవలను మరింత నాణ్యతతో, తక్కువ ఖర్చుతో ప్రజలకు […]

విధాత: రైల్వే రంగాన్ని ప్రక్షాళన చేస్తానని చెప్పుకొంటున్న రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఉద్యోగుల గోస పుచ్చుకొంటున్నారు. సంతృప్తికర పని విధానం లేదని, అవినీతి, అలసత్వం పేరుకు పోయిందని, తదితర కారణాలతో ఏకంగా ఉద్యోగం నుంచే తొలగిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలొస్తున్నాయి.
రైల్వేలను బాగు పర్చాలంటే.. అనేక సంస్కరణలు చేపట్టాలి. రైళ్ల నిర్వహణ, రైల్వే స్టేషన్ల పరిశుభ్రత, నిర్వహణ విషయంలో సకల సదుపాయాలు, ఆధునిక టెక్నాలజీతో అభివృద్ధి చేయాలి. సేవలను మరింత నాణ్యతతో, తక్కువ ఖర్చుతో ప్రజలకు అందించాలి. కానీ రైల్వేలను తీర్చిదిద్దే పేరుతో ఉద్యోగులను బలి చేయటం అన్యాయమని ఉద్యోగులు వాపోతున్నారు.
2021 జూలై నుంచి ఇప్పటి దాకా 139 మందిని ఉద్యోగాల నుంచి తొలగించి ఇంటికి పంపారు. అంటే ప్రతి మూడు రోజులకు ఒక ఉద్యోగిని ఉద్యోగం నుంచి తొలగిస్తుండటం గమనార్హం. అవినీతి పేరుతో ఉద్యోగులను ఇంటికి పంపుతున్న రైల్వే మంత్రి రాజకీయ రంగంలో ఉన్న అవినీతి నిర్మూలనకు ఏ చర్యలు తీసుకుంటున్నారు.. ఎలాంటి మార్పులు చేస్తున్నారో చెప్తే బాగుంటుందని అందరూ అంటున్నారు.