Modi Thali | మోదీ జీ థాలీ.. అమెరికా రెస్టారెంట్ మెనూలో కొత్త వంట‌కం

Modi Thali విధాత‌: భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ అమెరికా ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా.. న్యూజెర్సీలోని రెస్టారెంట్ ఒక‌టి ఒక ప్ర‌త్యేక థాలీకి మోదీ పేరు (Modi ji thali) పెట్టింది. న‌గ‌రంలో ఉన్న ప్ర‌వాస భార‌తీయుల కోరిక మేర‌కు ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని రెస్టారెంట్ య‌జ‌మాని శ్రీ‌పాద్ కుల‌క‌ర్ణి వెల్ల‌డించారు. మోదీ జీ పేరుతో ఉన్న ఈ థాలీ వీడియోను ట్విట‌ర్‌లో వైర‌ల్ అవుతోంది. Before US visit, New Jersey restaurant to launch 'Modi Ji […]

Modi Thali | మోదీ జీ థాలీ.. అమెరికా రెస్టారెంట్ మెనూలో కొత్త వంట‌కం

Modi Thali

విధాత‌: భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ అమెరికా ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా.. న్యూజెర్సీలోని రెస్టారెంట్ ఒక‌టి ఒక ప్ర‌త్యేక థాలీకి మోదీ పేరు (Modi ji thali) పెట్టింది. న‌గ‌రంలో ఉన్న ప్ర‌వాస భార‌తీయుల కోరిక మేర‌కు ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని రెస్టారెంట్ య‌జ‌మాని శ్రీ‌పాద్ కుల‌క‌ర్ణి వెల్ల‌డించారు. మోదీ జీ పేరుతో ఉన్న ఈ థాలీ వీడియోను ట్విట‌ర్‌లో వైర‌ల్ అవుతోంది.

భార‌త‌దేశంలోని వివిధ ప్రాంతాల ఆహారాన్ని ఈ థాలీలో భాగం చేశారు. కిచిడీ, ర‌స‌గుల్లా, స‌ర్‌సాన్ కా సాగ్‌, కశ్మీరీ దం ఆలూ, ఇడ్లీ, ధోక్లా, చాచ్‌, పాప‌డ్ మొద‌లైన‌వి ఇందులో ఉన్నాయి. ఈ ఫుడ్‌ను ఇప్ప‌టికే ఎంతో మంది టేస్ట్ చేశార‌ని, అద్భుతంగా ఉంద‌ని కుల‌క‌ర్ణి తెలిపారు. జూన్ 21 నుంచి 24 వ‌ర‌కు మోదీ అమెరికాలో ప‌ర్య‌టించ‌నున్న విష‌యం తెలిసిందే.