TSLPRB | మ‌రో రెండు వారాల్లో ఎస్ఐ, కానిస్టేబుళ్ల తుది మెరిట్ జాబితా విడుద‌ల‌..!

TSLPRB | రాష్ట్రంలో ఎస్ఐ, పోలీసు కానిస్టేబుళ్ల ఉద్యోగాల భ‌ర్తీ ప్ర‌క్రియ తుది ద‌శ‌కు చేరింది. 17,516 పోస్టుల భ‌ర్తీకి తెలంగాణ స్టేట్ లెవ‌ల్ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు చ‌ర్య‌లు చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ పోస్టుల భ‌ర్తీకి సంబంధించి ప్రిలిమ్స్, ఫిజిక‌ల్ ఈవెంట్స్ నిర్వ‌హించిన అనంత‌రం కొద్ది నెల‌ల క్రితం తుది రాత ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన విష‌యం విదిత‌మే. మంగ‌ళ‌వారం సాయంత్రం ఎస్ఐ, పోలీసు కానిస్టేబుళ్ల తుది రాత ప‌రీక్ష‌ల ఫ‌లితాల‌ను విడుద‌ల చేసింది. 17,516 […]

TSLPRB | మ‌రో రెండు వారాల్లో ఎస్ఐ, కానిస్టేబుళ్ల తుది మెరిట్ జాబితా విడుద‌ల‌..!

TSLPRB |

రాష్ట్రంలో ఎస్ఐ, పోలీసు కానిస్టేబుళ్ల ఉద్యోగాల భ‌ర్తీ ప్ర‌క్రియ తుది ద‌శ‌కు చేరింది. 17,516 పోస్టుల భ‌ర్తీకి తెలంగాణ స్టేట్ లెవ‌ల్ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు చ‌ర్య‌లు చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ పోస్టుల భ‌ర్తీకి సంబంధించి ప్రిలిమ్స్, ఫిజిక‌ల్ ఈవెంట్స్ నిర్వ‌హించిన అనంత‌రం కొద్ది నెల‌ల క్రితం తుది రాత ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన విష‌యం విదిత‌మే.

మంగ‌ళ‌వారం సాయంత్రం ఎస్ఐ, పోలీసు కానిస్టేబుళ్ల తుది రాత ప‌రీక్ష‌ల ఫ‌లితాల‌ను విడుద‌ల చేసింది. 17,516 పోస్టుల‌కు తుది రాత ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా, 84.06 శాతం మంది అభ్య‌ర్థులు అర్హ‌త సాధించారు. అంటే 1,79,459 మంది అభ్య‌ర్థులకు గానూ 1,50,852 మంది ఉత్తీర్ణ‌త పొందారు. తుది రాత ప‌రీక్ష‌ల ఫ‌లితాలు వెలువ‌డిన నేప‌థ్యంలో మ‌రో రెండు వారాల్లో తుది మెరిట్ జాబితా విడుద‌ల చేయ‌నుంది టీఎస్ఎల్‌పీఆర్‌బీ.

రీకౌంటింగ్, రీవెరిఫికేష‌న్‌కు అవ‌కాశం

ఓఎంఆర్ షీట్ల మూల్యాంక‌నం ప‌టిష్టంగా చేప‌ట్టామ‌ని టీఎస్ఎల్‌పీఆర్‌బీ చైర్మ‌న్ వీవీ శ్రీనివాస్ రావు ప్ర‌క‌టించారు. అయిన‌ప్ప‌టికీ రీకౌంటింగ్, రీవెరిఫికేష‌న్‌కు అవ‌కాశం క‌ల్పించామ‌ని తెలిపారు. ఒక్కో ఓఎంఆర్ షీట్ రీకౌంటింగ్, రీ వెరిఫికేష‌న్‌కు ఎస్సీ, ఎస్టీ అభ్య‌ర్థులు రూ. 2 వేలు, ఇత‌ర అభ్య‌ర్థులు రూ. 3 వేల చొప్పున చెల్లించాల్సి ఉంటుంద‌న్నారు.

ఈ ఓఎంఆర్ షీట్లు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయ‌ని తెలిపారు. జూన్ 1న ఉద‌యం 8 గంట‌ల నుంచి జూన్ 3 రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు అభ్య‌ర్థులు వ్య‌క్తిగ‌త లాగిన్ ద్వారా ఆన్‌లైన్‌లో రుసుం చెల్లించొచ్చు. తుది రాత ప‌రీక్ష‌లు అర్హ‌త సాధించిన అభ్య‌ర్థుల ధ్రువీక‌ర‌ణ ప‌త్రాల ప‌రిశీల‌న అనంత‌ర‌మే తుది మెరిట్ జాబితా ప్ర‌క‌టిస్తామ‌ని వీవీ శ్రీనివాస్ రావు తెలిపారు.