TSPSC | ఓయూలో నిరుద్యోగ మార్చ్.. రేవంత్ రెడ్డి గృహ నిర్బంధం..

TSPSC | విధాత: టీఎస్‌పీఎస్సీ నిర్వ‌హించే ప‌లు ప‌రీక్ష‌ల ప్ర‌శ్నాప‌త్రాలు లీక్ (Paper Leak) కావ‌డంతో.. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఆందోళ‌న‌లు, ధ‌ర్నాలు చేప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఉస్మానియా యూనివ‌ర్సిటీ (Osmania University)లో నిరుద్యోగ మార్చ్‌కు ఓయూ జేఏసీ (OU JAC) పిలుపునిచ్చింది. ఈ మార్చ్‌కు కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy)తో పాటు ప‌లువురు ముఖ్య నేత‌లు హాజ‌ర‌వుతార‌ని పోలీసులు భావించారు. దీంతో రేవంత్ రెడ్డిని జూబ్లీ హిల్స్‌లోని త‌న […]

TSPSC | ఓయూలో నిరుద్యోగ మార్చ్.. రేవంత్ రెడ్డి గృహ నిర్బంధం..

TSPSC |

విధాత: టీఎస్‌పీఎస్సీ నిర్వ‌హించే ప‌లు ప‌రీక్ష‌ల ప్ర‌శ్నాప‌త్రాలు లీక్ (Paper Leak) కావ‌డంతో.. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఆందోళ‌న‌లు, ధ‌ర్నాలు చేప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఉస్మానియా యూనివ‌ర్సిటీ (Osmania University)లో నిరుద్యోగ మార్చ్‌కు ఓయూ జేఏసీ (OU JAC) పిలుపునిచ్చింది.

ఈ మార్చ్‌కు కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy)తో పాటు ప‌లువురు ముఖ్య నేత‌లు హాజ‌ర‌వుతార‌ని పోలీసులు భావించారు. దీంతో రేవంత్ రెడ్డిని జూబ్లీ హిల్స్‌లోని త‌న నివాసంలో గృహ నిర్బంధం చేశారు. ఇక ఉస్మానియా యూనివ‌ర్సిటీని పోలీసులు త‌మ ఆధీనంలోకి తీసుకున్నారు.

ఉద‌యం 7:30 గంట‌ల నుంచే ఉస్మానియా యూనివ‌ర్సిటీలోకి వాహ‌నాల‌ను అనుమ‌తించ‌డం లేదు. అటు ఓయూ పోలీసు స్టేష‌న్ వ‌ద్ద ఉన్న గేటును, ఇటు ఎన్‌సీసీ వ‌ద్ద ఉన్న గేటును పోలీసులు మూసేశారు. కేవ‌లం ఉస్మానియా యూనివ‌ర్సిటీ ఉద్యోగుల‌ను, విద్యార్థుల‌ను మాత్ర‌మే అనుమ‌తిస్తున్నారు. ఓయూలోని ప‌లు ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహ‌రించారు.

జూబ్లీహిల్స్‌లోని రేవంత్ ఇంటి వ‌ద్ద కూడా బారికేడ్లు ఏర్పాటు చేశారు. స్థానికుల‌ను సైతం త‌నిఖీ చేసి పంపిస్తున్నారు పోలీసులు. గుర్తింపు కార్డులు క‌లిగిన వ్య‌క్తుల‌నే అనుమ‌తిస్తున్నారు. పీసీసీ ఉపాధ్య‌క్షుడు మ‌ల్లు ర‌వి, కాంగ్రెస్ నేత‌లు అంజ‌న్ కుమార్ యాద‌వ్, అద్దంకి ద‌యాక‌ర్, అనిల్‌తో పాటు ఓయూ జేఏసీ నేత‌లను పోలీసులు గృహ నిర్బంధం చేశారు.