ప్రమాణా స్వీకారానికి ఎల్బీ స్టేడియం చేరుకున్న రేవంత్‌రెడ్డి
తెలంగాణ సీఎంగా పదవి ప్రమాణస్వీకారం చేసేందుకు రేవంత్‌రెడ్డి జూబ్లిహిల్స్‌లోని తన ఇంటి నుంచి బయలుదేరారు

విధాత: తెలంగాణ సీఎంగా పదవి ప్రమాణస్వీకారం చేసేందుకు రేవంత్‌రెడ్డి జూబ్లిహిల్స్‌లోని తన ఇంటి నుంచి బయలుదేరారు. ఆయన మార్గమధ్యలో ప్రమాణ స్వీకారానికి ముందు జూబ్లీహిల్స్లోని పెద్దమ్మతల్లి గుడికి కుటుంబసభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం గన్‌పార్కు వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు.
అనంతరం ఎల్బీ స్టేడియం చేరుకున్నారు.అయితే ఎల్బీ స్టేడియం దారిలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేస్తూ రేవంత్‌ను స్టేడియం వైపు తీసుకెళ్లారు. కాగా ఏఐసీసీ నాయకులు, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సహా వివిధ రాష్ట్రాల నుంచి, జిల్లాల నుంచి వచ్చిన ప్రముఖుల వాహనాలు కూడా ట్రాఫిక్‌లో చిక్కుకుపోయాయి.
మరోవైపు గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్లో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రత్యేక బస్సుల్లో ఎల్బీ స్టేడియానికి చేరుకున్నారు. మధ్యాహ్నం 1.04 గంటలకు రేవంత్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.