Revanth Reddy | KCR వ్యతిరేక రాజకీయ పునరేకీకరణ కోసమే ఈ చేరికలు.. ఇంకా చాలా మంది వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు: రేవంత్‌ రెడ్డి

Revanth Reddy | కోమటిరెడ్డి ఇంటికి వెళ్లిన రేవంత్‌ రెడ్డి అక్కడి నుంచి ఇదరు కలిసి జూపల్లి ఇంటికి ఆ తరువాత అందరు కలిసి పొంగులేటి ఇంటికి విధాత: తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్‌ వ్యతిరేక రాజకీయ పునరేకీకరణ కోసమే వీరంతా కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నారని పీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి తెలిపారు. బుధవారం రేవంత్‌రెడ్డి నేరుగా ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనతో చర్చలు జరిపారు. అందరం సమిష్టిగా కాంగ్రెస్‌ పార్టీ గెలుపు కోసం పని […]

  • By: krs    latest    Jun 21, 2023 9:09 AM IST
Revanth Reddy | KCR వ్యతిరేక రాజకీయ పునరేకీకరణ కోసమే ఈ చేరికలు.. ఇంకా చాలా మంది వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు: రేవంత్‌ రెడ్డి

Revanth Reddy |

  • కోమటిరెడ్డి ఇంటికి వెళ్లిన రేవంత్‌ రెడ్డి
  • అక్కడి నుంచి ఇదరు కలిసి జూపల్లి ఇంటికి
  • ఆ తరువాత అందరు కలిసి పొంగులేటి ఇంటికి

విధాత: తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్‌ వ్యతిరేక రాజకీయ పునరేకీకరణ కోసమే వీరంతా కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నారని పీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి తెలిపారు. బుధవారం రేవంత్‌రెడ్డి నేరుగా ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనతో చర్చలు జరిపారు. అందరం సమిష్టిగా కాంగ్రెస్‌ పార్టీ గెలుపు కోసం పని చేద్దామని భావించారు. ఆతరువాత అక్కడి నుంచి ఇద్దరు కలిసి బీఆర్‌ఎస్‌ బహిష్కృత నేత మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటికి చేరుకున్నారు.

అక్కడ జూపల్లి కృష్ణారావుతో పాటు ఆయన అనుయాలతో రేవంత్‌, కోమటిరెడ్డిలు మాట్లాడారు. అందరిని కాంగ్రెస్‌ పార్టీలోకి రావాలని రేవంత్‌ ఆహ్వానించారు. జూపల్లి నివాసంలో అందరు కలిసి లంచ్‌ చేశారు. అనంతరం రేవంత్‌, కోమటి రెడ్డి వెంకటరెడ్డిలు కలిసి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ఇంటికి చేరుకుని కాంగ్రెస్‌ పార్టీలో చేరాలని ఆహ్వానించారు.

పొంగేలేటి ఇంటికి బయలు దేరడానికి ముందుగా జూపల్లి నివాసం వద్ద తనను కలిసిన మీడియాతో రేవంత్‌ మాట్లాడుతూ పాలమూరు జిల్లా అభివృద్ధి కోసమే జూపల్లి, గుర్నాథ్ రెడ్డి, దామోదర్ రెడ్డి గతంలో బీఆరెస్ లో చేరారన్నారు. కానీ తొమ్మిదేళ్లు గడిచినా కేసీఆర్ పాలమూరు జిల్లాను అభివృద్ధి చేయలేదన్నారు.

పాలమూరు జిల్లాను అభివృద్ధి చేయనందుకే వారంతా కేసీఆర్ పై తిరుగుబావుటా ఎగరేశారన్నారు. పాలమూరు జిల్లా అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు. అందుకే వారిని కాంగ్రెస్‌లోకి ఆహ్వానించడానికి వచ్చామన్నారు. ఈ చేరికలన్నీ తెలంగాణ ప్రజలకు మేలు చేసేందుకేనన్నారు. వీళ్లే కాదు.. ఇంకా చాలా మంది కాంగ్రెస్ లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

మంచి ముహూర్తంలో వీరంతా కాంగ్రెస్ లో చేరుతారన్నారు. తెలంగాణలో 17పార్లమెంటు స్థానాలు గెలిపించి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని క్రియాశీలకం చేయాల్సిన అవసరం ఉందని రేవంత్‌ అన్నారు. తెలంగాణకు మంచి రోజులు రాబోతున్నాయన్నారు.