రేవంత్‌ VS కవిత ట్వీట్‌ వార్‌.. దీక్షా దివాస్ కాదు.. దగా దివాస్!

విధాత: దీక్షా దివస్ కాంగ్రెస్ పార్టీ టీఆర్‌ఎస్‌ల మధ్య ట్విట్టర్ వార్‌కు తెర తీసింది. తెలంగాణ ద్రోహులకు అడ్డా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ బిడ్డల బలిదానాలకు కాంగ్రెస్ పార్టీనే కారణమని.. రాష్ట్రాన్ని ఇస్తామని చెప్పి వెనక్కి తగ్గి రాష్ట్ర ఏర్పాటుపై కాలయాపన చేసినందుకే వేలాది మంది తెలంగాణ యువకులు రాష్ట్ర సాధన కోసం బలిదానం చేశారని ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేయగా. ఆమెకు కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చారు. దీక్షా దివస్ కాదు అది దగా దివస్ […]

  • By: krs    latest    Nov 29, 2022 5:44 PM IST
రేవంత్‌ VS కవిత ట్వీట్‌ వార్‌.. దీక్షా దివాస్ కాదు.. దగా దివాస్!

విధాత: దీక్షా దివస్ కాంగ్రెస్ పార్టీ టీఆర్‌ఎస్‌ల మధ్య ట్విట్టర్ వార్‌కు తెర తీసింది. తెలంగాణ ద్రోహులకు అడ్డా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ బిడ్డల బలిదానాలకు కాంగ్రెస్ పార్టీనే కారణమని.. రాష్ట్రాన్ని ఇస్తామని చెప్పి వెనక్కి తగ్గి రాష్ట్ర ఏర్పాటుపై కాలయాపన చేసినందుకే వేలాది మంది తెలంగాణ యువకులు రాష్ట్ర సాధన కోసం బలిదానం చేశారని ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేయగా. ఆమెకు కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చారు. దీక్షా దివస్ కాదు అది దగా దివస్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రేవంత్ రెడ్డి కూడా కవిత ట్వీట్ పై మండిపడ్డారు. వంటావార్పులో పప్పన్నం తిన్నందుకే.. బతుకమ్మ ఆడినందుకే.. బోనం కుండలు ఎత్తినందుకే.. మీ ఇంటిల్లపాది సకల పదవుల, భోగభాగ్యాలు అనుభవిస్తున్నారు. తెలంగాణ కోసం చిరునవ్వుతో ప్రాణాలు వదిలిన శ్రీకాంతాచారి, కానిస్టేబుల్ కిష్టయ్య, యాదయ్యల త్యాగాలను ఏమనాలి? అని ప్రశ్నించారు.