ఆర్ఎఫ్‌సీఎల్‌లో 28 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం

రామ‌గుండం ఫెర్టిలైజ‌ర్స్ అండ్ కెమిక‌ల్స్ లిమిటెడ్‌(RFCL), రామ‌గుండం ప్లాంట్ 28 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది

  • By: Somu    latest    Feb 19, 2024 10:35 AM IST
ఆర్ఎఫ్‌సీఎల్‌లో 28 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం

హైద‌రాబాద్ : రామ‌గుండం ఫెర్టిలైజ‌ర్స్ అండ్ కెమిక‌ల్స్ లిమిటెడ్‌(RFCL), రామ‌గుండం ప్లాంట్ 28 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. ఈ పోస్టుల భ‌ర్తీ రెండు అంచెల్లో జ‌ర‌గ‌నుంది. మొద‌ట కంప్యూట‌ర్ ఆధారిత ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్నారు. ఈ ప‌రీక్ష‌లో ఉత్తీర్ణ‌త సాధించిన అభ్య‌ర్థుల‌కు ఇంట‌ర్వ్యూలు నిర్వ‌హించి, ధ్రువ‌ప‌త్రాల ప‌రిశీల‌న ఆధారంగా ఎంపిక చేస్తారు. ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ మార్చి 14.

పోస్టుల వివ‌రాలు..

మేనేజ్‌మెంట్ ట్రైనీ(కెమిక‌ల్) : 10 పోస్టులు. కెమిక‌ల్ ఇంజినీరింగ్ లేదా కెమిక‌ల్ టెక్నాల‌జీలో బీఈ/ బీటెక్/ బీఎస్సీ(ఇంజినీరింగ్) పాస‌వ్వాలి. బాయిల‌ర్ ఆప‌రేష‌న్ ఇంజినీర్(బీవోఈ) స‌ర్టిఫికేష‌న్ ఉన్న‌వారికి ప్రాధాన్య‌త ఇస్తారు.

మెకానిక‌ల్ : 6 పోస్టులు. మెకానిక‌ల్ ఇంజినీరింగ్/ టెక్నాల‌జీలో బీఈ/ బీటెక్/ బీఎస్సీ(ఇంజినీరింగ్) పూర్తి చేసి ఉండాలి.

ఎల‌క్ట్రిక‌ల్ : 3 పోస్టులు. ఎల‌క్ట్రిక‌ల్/ ఎల‌క్ట్రిక‌ల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ /ఎల‌క్ట్రిక‌ల్ టెక్నాల‌జీలో బీఈ/ బీటెక్/ బీఎస్సీ(ఇంజినీరింగ్) పాస‌వ్వాలి.

ఇన్‌స్ట్రుమెంటేష‌న్ : 2 పోస్టులు. ఇన్‌స్ట్రుమెంటేష‌న్/ ఇన్‌స్ట్రుమెంటేష‌న్ అండ్ కంట్రోల్/ ఎల‌క్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేష‌న్/ ఎల‌క్ట్రానిక్స్ ఇన్‌స్ట్రుమెంటేష‌న్ అండ్ కంట్రోల్/ ఇండ‌స్ట్రీయ‌ల్ ఇన్‌స్ట్రుమెంటేష‌న్‌లో బీఈ/బీటెక్/బీఎస్సీ(ఇంజినీరింగ్) చేసి ఉండాలి.

ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ : 3 పోస్టులు. కంప్యూట‌ర్ సైన్స్/కంప్యూట‌ర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్/కంప్యూట‌ర్ ఇంజినీరింగ్/కంప్యూట‌ర్ టెక్నాల‌జీ/ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీలో బీఈ/బీటెక్/బీఎస్సీ(ఇంజినీరింగ్) లేదా ఎంసీఏ చేసి ఉండాలి.

లా : ఒక పోస్టు. లా డిగ్రీ లేదా ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్‌బీ. కంపెనీ సెక్ర‌ట‌రీ/కార్పొరేట్ లాలో డిప్లొమా ఉన్న‌వారికి ప్రాధాన్య‌మిస్తారు.

మేనేజ్‌మెంట్ ట్రైనీ(హెచ్ఆర్) : 3 పోస్టులు. ఎంబీఏ/ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ/పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ పాస‌వ్వాలి. హెచ్ఆర్ఎం/ప‌ర్స‌న‌ల్ మేనేజ్‌మెంట్ అండ్ ఇండస్ట్రియ‌ల్ రిలేష‌న్స్ డిప్లొమా, లా డిగ్రీ ఉన్న‌వారికి ప్రాధాన్య‌మిస్తారు.

అర్హ‌త‌లు..

29-02-2024 నాటికి ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ల‌కు 25, ఎంబీఏ అభ్య‌ర్థుల‌కు 29 సంవ‌త్స‌రాలు మించ‌కూడ‌దు. గ‌రిష్ట వ‌య‌సులో ఎస్సీ, ఎస్టీల‌కు 5 ఏండ్లు, ఓబీసీల‌కు 3 ఏండ్లు మిన‌హాయింపు ఉంటుంది. ప్ర‌క‌టించిన అన్ని పోస్టుల‌కు డిగ్రీ 60 శాతం మార్కుల‌తో పాస్ కావాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్య‌ర్థుల‌కు 50 శాతం మార్కులు స‌రిపోతాయి. కంప్యూట‌ర్ పరిజ్ఞానం ఉండాలి. మొత్తం 28 పోస్టుల్లో అన్‌రిజ‌ర్వ్‌డ్‌కు 18, ఎస్టీల‌కు 01, ఓబీసీ(ఎన్‌సీఎల్‌)కు 02, ఈడ‌బ్ల్యూఎస్‌కు 07 కేటాయించారు. ఇక ఎంపికైన అభ్య‌ర్థుల‌ను ఆర్ఎఫ్‌సీఎల్ యూనిట్, ఆఫీసుల్లో ఎక్క‌డైనా నియ‌మించొచ్చు.

ద‌ర‌ఖాస్తు రుసుము : రూ. 700. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్ఎం అభ్య‌ర్థుల‌కు ఫీజు లేదు. త‌దిత‌ర వివ‌రాల కోసం https://rfcl.co.in/ అనే వెబ్‌సైట్‌ను లాగిన్ అవొచ్చు.