RGV Vs Pawan Kalyan | పవన్‌ను వదలని ఆర్జీవీ.. తొమ్మిది ప్రశ్నలు సంధించిన దర్శకుడు

RGV Vs Pawan Kalyan | విధాత‌: చంద్రబాబును స్కిల్ డెవల ప్మెంట్ కార్పొరేషన్ స్కాంలో సీఐడీ అరెస్ట్ చేసిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మాత్రం వేగంగా స్పందించారు. ఆగమేఘాల మీద హైదరాబాద్ నుంచి కార్లో విజయవాడ వచ్చి రోడ్ల మీద దొర్లుకుంటూ ఆందోళన చేస్తూ చంద్రబాబుకు మద్దతు ప్రకటించారు. సగటు టిడిపి నాయకులు.. కార్యకర్తల కన్నా పవన్ వేగంగా ఎక్కువగా స్పందించడం సగటు జనసైనికులను సైతం ఆశ్చర్యపరిచింది. Also just for ur perusal , […]

RGV Vs Pawan Kalyan | పవన్‌ను వదలని ఆర్జీవీ.. తొమ్మిది ప్రశ్నలు సంధించిన దర్శకుడు

RGV Vs Pawan Kalyan |

విధాత‌: చంద్రబాబును స్కిల్ డెవల ప్మెంట్ కార్పొరేషన్ స్కాంలో సీఐడీ అరెస్ట్ చేసిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మాత్రం వేగంగా స్పందించారు. ఆగమేఘాల మీద హైదరాబాద్ నుంచి కార్లో విజయవాడ వచ్చి రోడ్ల మీద దొర్లుకుంటూ ఆందోళన చేస్తూ చంద్రబాబుకు మద్దతు ప్రకటించారు. సగటు టిడిపి నాయకులు.. కార్యకర్తల కన్నా పవన్ వేగంగా ఎక్కువగా స్పందించడం సగటు జనసైనికులను సైతం ఆశ్చర్యపరిచింది.

టిడిపి వాళ్ళను మించి మా నాయకుడు ఎందుకు స్పందిస్తున్నది వాళ్లకు అర్థం కాని పరిస్థితి. అచ్చం ఇదే సందేహం ఆర్జివికి వచ్చినట్లుంది. అందుకే పలు సందేహాలతో కూడిన తొమ్మిది ప్రశ్నలను ఆయన సంధించారు. ఈమేరకు ఆయన ట్విట్టర్లో ఆ ప్రశ్నలు పోస్ట్ చేశారు. ఇవిగో ఆ ప్రశ్నలు
పవన్ కు 9 సూటి ప్రశ్నలు

రామ్ గోపాల్ వర్మ

  1. అసలు స్కిల్ స్కాం జరిగిందా లేదా?
  2. ఒకవేళ జరిగుంటే, CBN గారికి తెలియకుండా జరిగిందా?
  3. 300 కోట్లు పైగా ప్రజా ధనాన్ని ప్రొసీజర్స్ ఫాలో అవ్వకుండా , ఆఫీసర్స్ చెప్తున్నా వినకుండా రిలీజ్ చేశారా లేదా?
  4. ఒక వేళ హెడ్ ఆఫ్ గవర్నమెంట్ CBN గారికి స్కాం గురించి తర్వాత తెలిసుంటే , దానిమీద ఇమ్మిడియట్ ఆక్షన్ తీసుకోకపోవటం కరెక్టా?
  5. FIR అనేది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ మాత్రమే… ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ లో సేకరించిన ఇన్ఫర్మేషన్ బట్టి ఎప్పుడైనా ఎవరి పేరైనా యాడ్ చెయ్యచ్చన్న విషయం మీకు తెలియదా?
  6. చూపించిన డాక్యుమెంట్స్ బట్టి క్రైమ్ చేసినట్టు ప్రైమా ఫేసీ ఎవిడెన్స్ వుందని నమ్మిన జడ్జ్ గారు బెయిల్ ఇవ్వకపోవటం తప్పా?
  7. సెక్షన్ 409 అప్లై అవుతుందని రిమాండ్ గ్రాంట్ చేసిన జడ్జ్ గారు కరప్టా ?
  8. లీడర్స్ వాళ్ళ నలభై ఏళ్ల బ్యాక్ గ్రౌండ్ బట్టి కాదు , వాళ్ళు చేసే పనుల బట్టి అనే విషయం మీకు తెలియదా ?
  9. నా తొమ్మిదవ చివరి ప్రశ్న , అసలు స్కిల్ స్కాం కేసు మీకేమర్ధమయ్యిందో , దానిలోని తప్పులెంటో ఒక వీడియో లో కెమెరా వంక చూస్తూ వివరించగలరా.?