Viral Video | రైనోస్ వ‌ర్సెస్ ల‌య‌న్స్‌.. అడ‌వికి నిజ‌మైన కింగ్ ఎవ‌రు..?

Viral Video | అడ‌వి అన‌గానే సింహాలు, పులులతో పాటు ఇత‌ర జంతువులు గుర్తుకు వ‌స్తుంటాయి. అన్ని జంతువుల్లో కెల్లా పులులు, సింహాలే అడ‌విలో అధిప‌త్యం కొన‌సాగిస్తుంటాయి. క‌నిపించిన ప్ర‌తి జంతువును వేటాడి, భ‌క్షిస్తుంటాయి. దీంతో తామే అడ‌వుల‌కు రాజుల‌మ‌ని సింహాలు, పులులు విర్ర‌వీగిపోతుంటాయి. త‌మ గంభీర‌త్వాన్ని ప్ర‌ద‌ర్శించి ఇత‌ర జంతువుల‌కు వణుకు పుట్టిస్తుంటాయి. కానీ కొన్ని సంద‌ర్భాల్లో పులులు, సింహాల‌కు కూడా వ‌ణుకు పుట్టించే జంతువులు ఉన్నాయి. అలా సింహాల‌కు, పులికి వ‌ణుకు పుట్టించిన ఓ […]

  • By: raj    latest    Sep 09, 2023 10:37 AM IST
Viral Video | రైనోస్ వ‌ర్సెస్ ల‌య‌న్స్‌.. అడ‌వికి నిజ‌మైన కింగ్ ఎవ‌రు..?

Viral Video |

అడ‌వి అన‌గానే సింహాలు, పులులతో పాటు ఇత‌ర జంతువులు గుర్తుకు వ‌స్తుంటాయి. అన్ని జంతువుల్లో కెల్లా పులులు, సింహాలే అడ‌విలో అధిప‌త్యం కొన‌సాగిస్తుంటాయి. క‌నిపించిన ప్ర‌తి జంతువును వేటాడి, భ‌క్షిస్తుంటాయి. దీంతో తామే అడ‌వుల‌కు రాజుల‌మ‌ని సింహాలు, పులులు విర్ర‌వీగిపోతుంటాయి.

త‌మ గంభీర‌త్వాన్ని ప్ర‌ద‌ర్శించి ఇత‌ర జంతువుల‌కు వణుకు పుట్టిస్తుంటాయి. కానీ కొన్ని సంద‌ర్భాల్లో పులులు, సింహాల‌కు కూడా వ‌ణుకు పుట్టించే జంతువులు ఉన్నాయి. అలా సింహాల‌కు, పులికి వ‌ణుకు పుట్టించిన ఓ రెండు దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

సుశాంత నంద అనే ఐఎఫ్ఎస్ అధికారి.. ఓ వీడియోను ఎక్స్‌లో షేర్ చేశారు. అదేంటంటే.. రెండు సింహాలు దారి మ‌ధ్య‌లో నిద్రిస్తున్నాయి. అదే దారిలో ఓ రెండు ఖ‌డ్గ మృగాలు(రైనో) కూడా న‌డుచుకుంటూ వ‌స్తున్నాయి.

ఖ‌డ్గ‌మృగాల న‌డ‌క‌కు సింహాల‌కు మెల‌కువ వ‌చ్చింది. రైనోస్‌ను చూసిన ల‌య‌న్స్‌.. నిద్ర‌లో నుంచి తేరుకుని చెట్ల పొద‌ల్లోకి ప‌రుగెత్తాయి. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది.

ఇక మ‌రో వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి ర‌మేశ్ పాండే షేర్ చేశారు. ఈ వీడియోలో ఓ పులి అడ‌విలో ఉన్న న‌డ‌క‌దారిలో ప్ర‌శాంతంగా ప‌డుకుంది. దాని వెనుకాల నుంచి గ‌జ‌రాజు నెమ్మ‌దిగా న‌డుచుకుంటూ వ‌స్తున్నాడు. ఏనుగును గ‌మ‌నించిన పులి పిల్ల‌.. అడ‌విలోకి పారిపోయింది.