New York | ప్లే స్టేషన్ 5 ఉచితంగా ఇస్తానన్న యూట్యూబర్.. పోటెత్తిన యువత! అల్లర్లు, లాఠీఛార్జ్
New York విధాత: ఈ మధ్య యూట్యూబర్లు, ఇన్‌స్టా ఇన్‌ఫ్లూయెన్సర్‌లు తమ సబ్‌స్క్రైబర్లకు గివ్ ఎవే (వస్తువులు ఉచితంగా పంచడం)లు ఇవ్వడం బాగా పెరిగింది. తాజాగా అమెరికా (America) లో ఒక ఇన్‌ఫ్లూయెన్సర్ పిలుపునిచ్చిన గివ్ ఎవే కార్యక్రమం రసాభసగా మొదలై.. లాఠీఛార్జ్ వరకు వెళ్లింది. పలువురికి గాయాలు కూడా అయ్యాయి. 21 ఏళ్ల కాయ్ సెనట్ అనే ఇన్‌ఫ్లూయెన్సర్ శుక్రవారం గివ్ ఎవే కార్యక్రమం నిర్వహిస్తానని… ఆసక్తి ఉన్న వాళ్లు రావాలని ఇన్‌స్టాలో పిలుపునిచ్చాడు. లోవర్ […]

New York
విధాత: ఈ మధ్య యూట్యూబర్లు, ఇన్‌స్టా ఇన్‌ఫ్లూయెన్సర్‌లు తమ సబ్‌స్క్రైబర్లకు గివ్ ఎవే (వస్తువులు ఉచితంగా పంచడం)లు ఇవ్వడం బాగా పెరిగింది. తాజాగా అమెరికా (America) లో ఒక ఇన్‌ఫ్లూయెన్సర్ పిలుపునిచ్చిన గివ్ ఎవే కార్యక్రమం రసాభసగా మొదలై.. లాఠీఛార్జ్ వరకు వెళ్లింది. పలువురికి గాయాలు కూడా అయ్యాయి. 21 ఏళ్ల కాయ్ సెనట్ అనే ఇన్‌ఫ్లూయెన్సర్ శుక్రవారం గివ్ ఎవే కార్యక్రమం నిర్వహిస్తానని… ఆసక్తి ఉన్న వాళ్లు రావాలని ఇన్‌స్టాలో పిలుపునిచ్చాడు.
లోవర్ మాన్‌హాటన్‌లో జరిగే ఈ కార్యక్రమంలో అనేక బహుమతులు ఇస్తానని వాటిల్లో ప్లే స్టేషన్ 5 (Play Station 5) లు కూడా ఉంటాయని చెప్పాడు. దీంతో శుక్రవారం సుమారు 2000 మందికి పైగానే యువత ఈ కార్యక్రమానికి పోటెత్తారు. సెనట్ యూట్యూబ్, ఇన్‌స్టా, ట్విచ్ సామాజిక మాధ్యమాల్లో భారీ సంఖ్యలో ఫాలోవర్లు ఉండటంతో.. అతడిని చూడటానికి, ప్లే స్టేషన్‌ను ఉచితంగా తీసుకోవడానికి వీరు పోటీ పడ్డారు. కార్యక్రమం జరుగుతున్న చుట్టు పక్కల వీధులు కిక్కిరిసిపోయాయి.
దీంతో ఉక్కిరిబిక్కిరైన కొంత మంది.. అక్కడే నిర్మాణం జరుగుతున్న ఓ భవనంపైకి ఎక్కి కిందనున్న వాళ్ల మీదకు, పోలీసుల మీదకు రాళ్లు విసరడం ప్రారంభించారు. కొంతమంది యువకులు కార్ల అద్దాలను బద్దలుకొట్టడం వీడియోల్లో కనిపించింది.
ఈ అల్లర్లలో చాలా మందికి తలలు పగిలి రక్తాలు కూడా వచ్చాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. వెయ్యి మంది సిబ్బందితో వచ్చి ఆందోళనకారులపై లాఠీఛార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. వీడియోలు, ఫొటోల ద్వారా కొందరు యువకులను గుర్తుపట్టి అరెస్టు చేశారు. సదరు యూట్యూబర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.