రోహిత్ శర్మ గోర్లు కొరకడంపై మండిపడ్డ రితికా..షాకింగ్ ఆన్సర్ ఇచ్చిన హిట్‌మ్యాన్

వరల్డ్ కప్‌కి ముందు హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ పేరు సోషల్ మీడియాలో తెగ మారుమ్రోగిపోతుంది. ప్రతిష్టాత్మక టోర్నీకి ముందు ఫామ్‌లోకి రావడం ఫ్యాన్స్‌కి ఫుల్ ఆనందాన్ని ఇస్తుంది. ఇక రోహిత్ శర్మ ఎక్కువగా గోర్లు కొరుకుతుండడం మనం చూస్తూనే ఉన్నాం.
అయితే దీనిపై తాజాగా ఆయనకి ప్రశ్న ఎదురైంది. రోహిత్ ఆయన భార్య రితికాకి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ కాగా, ఇందులో రితికా మాట్లాడుతూ.. నాకు రోహిత్లో నచ్చే బెస్ట్ క్వాలిటీ.. అతను అందరి ప్రేమించడమే కాక, నచ్చినట్టుగా ఉంటాడు. అతను ఎవరినైన ప్రేమిస్తాడు అని చెబుతుంది. అయితే నచ్చని విషయం ఏంటంటే గోర్లు కొరకడం.

గోర్లు కొరికే అలవాటు మార్చుకోవాలని ఎన్ని సార్లు చెప్పినా కూడా రోహిత్ అసలు వినడు. సమ్మీ (రోహిత్, రితికా కూతురు సమైరా) కూడా గోర్లు కొరుక్కోవడం ఆపేసింది. కాని రోహిత్ మాత్రం ఇప్పటికీ మారలేదు.. అసలు ఎందుకు ఎప్పుడూ గోర్లు కొరుక్కుంటాడా? ఎవరికి అర్థం కాదు..’ అంటూ కామెంట్ చేసింది రితికా శర్మ.. అయితే రితికాకి తనదైన శైలిలో బదులు ఇచ్చాడు రోహిత్.
కెప్టెన్సీ ప్రెషర్ ఎలా ఉంటుందో ఈమెకేమి తెలుసు…’ అంటూ నవ్వుతూ బదులిచ్చాడు. మొత్తానికి రోహిత్ శర్మ సమాధానం ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఇక రోహిత్ కెప్టెన్సీలో టీమిండియా ఇప్పుడు వరల్డ్ కప్ ఆడబోతున్న విషయం తెలిసిందే.వరల్డ్ కప్‌కి ముందు రోహిత్ మంచి ఫామ్‌లోకి రాగా, ఇదే వరల్డ్ కప్ లో కూడా కంటిన్యూ చేస్తే కప్ అందుకోవడం పెద్ద కష్టమేమి కాదు.

ఇక 2021 నవంబర్‌లో టీమిండియా టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న రోహిత్ శర్మ, ఆ తర్వాత వన్డే, టెస్ట్ కెప్టెన్‌గానూ ప్రమోషన్ దక్కించుకున్నాడు. 35 ఏళ్ల లేటు వయసులో టీమిండియాకి త్రీ ఫార్మాట్ కెప్టెన్ అయిన రోహిత్ శర్మకి వర్క్ లోడ్ మేనేజ్మెంట్ ఎక్కువగా ఉండడం వలన టీ 20 సిరీస్‌లకి దూరంగా ఉంటున్నాడు.
కెప్టెన్‌గా 2023 వన్డే వరల్డ్ కప్ విజయం, రోహిత్ శర్మ కెరీర్‌కి చాలా కీలకంగా మారనుంది. ఈ టోర్నీలో టీమిండియా టైటిల్ గెలవకపోతే, రోహిత్ శర్మ, కెప్టెన్సీ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడే అవకాశం ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.