Mars | అంగార‌కుడిపై గారె ఆకారంలో రాయి.. ఏలియ‌న్స్ ఆ ప‌ని కోస‌మే ఉప‌యోగించారా?

విధాత‌: అంగార‌కుడి (Mars) పైకి నాసా పంపిన ప‌ర్‌సెవ‌రెన్స్ రోవ‌ర్ పంపిన ఒక ఫొటో అంత‌రిక్ష ప‌రిశోధ‌కులు, ఔత్సాహికుల స‌మూహాల్లో చ‌ర్చ‌కు దారి తీసింది. గారె (వ‌డ‌) ఆకారంలో ఉన్న ఓ రాయి ఫొటోను ఆ రోవ‌ర్ భూమిపై ఉన్న శాస్త్రవేత్త‌ల‌కు పంపించింది. ఇది ఏమై ఉంటుందని ఎవ‌రికి వారు ఊహించి స‌మాధానాలు పోస్ట్ చేస్తున్నారు. 2020 జులైలో ప్ర‌యోగించిన ప‌ర్‌సెవ‌రెన్స్ రోవ‌ర్ ప్ర‌స్తుతం 45 కి.మీ. వైశాల్యంలో ఉన్న జ‌జెరో క్రాట‌ర్ ప్రాంతంలో క‌లియ‌తిరుగుతోంది. మైక్రోబియల్ […]

Mars | అంగార‌కుడిపై గారె ఆకారంలో రాయి.. ఏలియ‌న్స్ ఆ ప‌ని కోస‌మే ఉప‌యోగించారా?

విధాత‌: అంగార‌కుడి (Mars) పైకి నాసా పంపిన ప‌ర్‌సెవ‌రెన్స్ రోవ‌ర్ పంపిన ఒక ఫొటో అంత‌రిక్ష ప‌రిశోధ‌కులు, ఔత్సాహికుల స‌మూహాల్లో చ‌ర్చ‌కు దారి తీసింది. గారె (వ‌డ‌) ఆకారంలో ఉన్న ఓ రాయి ఫొటోను ఆ రోవ‌ర్ భూమిపై ఉన్న శాస్త్రవేత్త‌ల‌కు పంపించింది. ఇది ఏమై ఉంటుందని ఎవ‌రికి వారు ఊహించి స‌మాధానాలు పోస్ట్ చేస్తున్నారు.

2020 జులైలో ప్ర‌యోగించిన ప‌ర్‌సెవ‌రెన్స్ రోవ‌ర్ ప్ర‌స్తుతం 45 కి.మీ. వైశాల్యంలో ఉన్న జ‌జెరో క్రాట‌ర్ ప్రాంతంలో క‌లియ‌తిరుగుతోంది. మైక్రోబియల్ జీవ అవ‌శేషాల కోసం అక్క‌డ ప‌రిశోధ‌న‌లు సాగిస్తున్నామ‌ని నాసా పేర్కొంది. అక్క‌డ రోవ‌ర్ సేక‌రించిన మ‌ట్టి రేణువులు, రాళ్ల శిథిలాల‌ను భూమి పైకి తీసుకురావాల‌ని నాసా ఆలోచ‌న‌.

అందుకే ఉప‌యోగించారా?

ఇప్పుడు ఆ విచిత్ర‌మైన రాయి విష‌యానికి వ‌స్తే.. ప్ర‌స్తుతం మార్స్‌పై జ‌జెరో క్రేట‌ర్ ద‌గ్గ‌ర ఉన్న ప‌ర్‌సెవ‌రెన్స్ రోవ‌ర్‌.. అక్క‌డికి 100 మీట‌ర్ల దూరంలో ప‌డిఉన్న విచిత్ర‌మైన రాయిని జూన్ 26న ఫొటో తీసి పంపింది. గారె లేదా అమెరికాలో ప్ర‌సిద్ధి చెందిన చిరుతిండి డోనట్ ఆకారంలో ఉన్న ఆ రాయిని చూసిన‌ నెటిజ‌న్లు ర‌క‌ర‌కాలుగా స్పందిస్తున్నారు.

దానిని ఏలియ‌న్‌లు మ‌ల విస‌ర్జ‌న‌కు ఉప‌యోగించార‌ని కొందరంటే… మ‌రికొంద‌రు అది గ్ర‌హాంత‌ర‌వాసుల గుడ్డు అని స్పందించారు. మార్స్‌పై జీవం ఉంద‌న‌డానికి ఇది ఒక రుజువ‌ని, ఐస్ ఏజ్ కాలానికి చెందిన అత్యాధునిక ఆయుధ‌మ‌ని.. ఇలా ప‌లువురు ప‌లు విధాలుగా ఆ రాయిని వ‌ర్ణించారు.

అబ్బే అదేం కాదు..

శాస్త్రవేత్త‌లు మాత్రం ఇది అంత‌రిక్షం నుంచి అంగార‌కుడిపైకి దూసుకొచ్చిన ఉల్క‌ (Meteorites) అని చెబుతున్నారు. ఇప్పుడు రోవ‌ర్ ఉన్న ప్రాంతంలో గ్ర‌హ‌శ‌క‌లాలు, ఆస్ట‌రాయిడ్స్, ఉల్క‌లు ప‌డ‌టం స‌ర్వ‌సాధార‌ణ‌మ‌ని వెల్ల‌డించారు.

ఎప్పుడైనా ప‌డిన ఓ ఉల్క మ‌ధ్య ప్రాంతం బ‌ల‌హీనంగా మారి కోత‌కు గురై ఉండొచ్చ‌ని.. అందువ‌ల్ల అది డోన‌ట్ ఆకారంలోకి వ‌చ్చింద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. లేదా ఆ చుట్టుప‌క్క‌ల ఉన్న ఓ పెద్ద రాయిపై ఉల్క ప‌డ‌టం వ‌ల్ల.. ఓ చిన్న రాయి ఎగిరొచ్చి ఇక్క‌డ ఈ ఆకారంలో ప‌డి ఉండొచ్చ‌ని పేర్కొన్నారు. ఆ రాయి ఎలా ఏర్ప‌డినా.. భూమిపై పెద్ద చ‌ర్చ‌కు దారి తీసింది. ప‌ర్‌సెవ‌రెన్స్ దాని ద‌గ్గ‌ర‌కి వెళ్లి మ‌రిన్ని వివ‌రాలు తెలుసుకుంటుందేమో చూడాలి.