RPF Constable | స్వీపర్‌కు ప్రసవం చేసిన RPF మహిళా కానిస్టేబుళ్లు..
RPF Constable | పురిటినొప్పులతో బాధపడుతున్న ఓ స్వీపర్‌కు నలుగురు ఆర్‌పీఎఫ్ మహిళా కానిస్టేబుళ్లు ప్రసవం చేశారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని అజ్మీర్ రైల్వేస్టేషన్‌లో గురువారం ఉదయం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. అజ్మీర్ రైల్వే స్టేషన్‌లో పని చేస్తున్న ఓ స్వీపర్ నిండు గర్భిణి. గురువారం ఉదయం ప్లాట్ ఫాం శుభ్రం చేస్తుండగా, ఆమెకు పురిటినొప్పులు వచ్చాయి. ఈ విషయాన్ని గమనించిన ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ వీరేంద్ర సింగ్ ఏఎస్ఐ ప్రేమారామ్‌కు ఫోన్‌లో తెలిపాడు. కాసేపటికే మహిళా […]

RPF Constable | పురిటినొప్పులతో బాధపడుతున్న ఓ స్వీపర్‌కు నలుగురు ఆర్‌పీఎఫ్ మహిళా కానిస్టేబుళ్లు ప్రసవం చేశారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని అజ్మీర్ రైల్వేస్టేషన్‌లో గురువారం ఉదయం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. అజ్మీర్ రైల్వే స్టేషన్‌లో పని చేస్తున్న ఓ స్వీపర్ నిండు గర్భిణి. గురువారం ఉదయం ప్లాట్ ఫాం శుభ్రం చేస్తుండగా, ఆమెకు పురిటినొప్పులు వచ్చాయి. ఈ విషయాన్ని గమనించిన ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ వీరేంద్ర సింగ్ ఏఎస్ఐ ప్రేమారామ్‌కు ఫోన్‌లో తెలిపాడు.
కాసేపటికే మహిళా కానిస్టేబుళ్లు హంసకుమారి, సావిత్రి ఫాగేడియా, లక్ష్మీవర్మలతో పాటు మరొకరు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే స్వీపర్ పూజకు తీవ్ర రక్తస్రావం జరిగింది. ఆస్పత్రికి తరలించే పరిస్థితి కూడా లేదు. దీంతో ఓ దుప్పటిని అడ్డుపెట్టి పూజకు అక్కడే నలుగురు మహిళా కానిస్టేబుళ్లు కలిసి ప్రసవం చేశారు. స్వీపర్‌కు పండంటి ఆడబిడ్డ జన్మించింది.
తల్లీబిడ్డను స్థానిక శాటిలైట్ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని కానిస్టేబుళ్లు పేర్కొన్నారు. స్వీపర్‌కు సురక్షితంగా ప్రసవం చేసిన మహిళా కానిస్టేబుళ్లపై ప్రశంసల వర్షం కురుస్తోంది. రైల్వే అధికారులు వారిని అభినందించారు.