Sadhguru ON ‘Natu Natu’ | RRR ‘నాటు నాటు’.. ప్రపంచం మొత్తం తాండవం చేస్తోంది: సద్గురు కామెంట్స్ వైరల్

'Natu Natu'.. Sadhguru's comments viral, KOREAN EMBASSY, RRR విధాత: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తున్న పేరు RRR. ఇండియా నుంచి ఆస్కార్ (Oscar) బరిలో నిలిచి.. మన దేశ స్థాయిని.. ముఖ్యంగా తెలుగు సినిమా స్థాయి ఏంటో నిరూపించిన సినిమా ఇది. రాజమౌళి (RAJAMOULI) ఎంతో ప్రతిష్టాత్మకంగా RRR తెరకెక్కించాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) ఇందులో నట విశ్వరూపాన్ని చూపారు. ఇప్పటికే ఈ […]

Sadhguru ON ‘Natu Natu’ | RRR ‘నాటు నాటు’.. ప్రపంచం మొత్తం తాండవం చేస్తోంది: సద్గురు కామెంట్స్ వైరల్

‘Natu Natu’.. Sadhguru’s comments viral, KOREAN EMBASSY, RRR

విధాత: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తున్న పేరు RRR. ఇండియా నుంచి ఆస్కార్ (Oscar) బరిలో నిలిచి.. మన దేశ స్థాయిని.. ముఖ్యంగా తెలుగు సినిమా స్థాయి ఏంటో నిరూపించిన సినిమా ఇది. రాజమౌళి (RAJAMOULI) ఎంతో ప్రతిష్టాత్మకంగా RRR తెరకెక్కించాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) ఇందులో నట విశ్వరూపాన్ని చూపారు. ఇప్పటికే ఈ సినిమా పలు అంతర్జాతీయ అవార్డులను కొల్లగొట్టింది. ఇప్పుడీ సినిమా ఆస్కార్ వైపు దూసుకెళ్తోంది. ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్‌కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఈ పాటకు సంబంధించి ఆసక్తికర ట్వీట్ చేశాడు ఆధ్యాత్మిక గురువు సద్గురు (Sadhguru).

ప్రపంచం మొత్తం తాండవం చేస్తోన్న నాటు నాటు

గోల్డెన్ గ్లోబ్ అవార్డు (Golden Globe Award) ను సొంతం చేసుకున్న నాటు నాటు సాంగ్ ది బెస్ట్ ఒరిజియన్ సాంగ్ కేటగిరిలో ఆస్కార్ బ‌రిలో నిలిచిన విష‌యం మ‌న‌కు తెలిసిందే. తాజాగా ఇండియాలో ఉన్న సౌదీ కొరియా (Saudi Korea) ఎంబసీ దౌత్యధికారులు ఈ పాట‌కు డాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాంతో ఆ డాన్స్‌పై ప్రధాని మోడీ (Prime Minister Modi) సైతం స్పందించారు.

ఈ నేపథ్యంలోనే నాటు నాటు సాంగ్‌పై ఆధ్యాత్మిక గురువు సద్గురు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సౌత్ కొరియన్స్ చేసిన ఈ డాన్స్ వీడియోను సద్గురు సోషల్ మీడియా (Social media)లో షేర్ చేశాడు. నాటు నాటు పాట ప్రస్తుతం ప్రపంచం మొత్తం తాండవం చేస్తోంది అంటూ ఆయన రాసుకొచ్చారు. అదేవిధంగా రామ్ చరణ్, ఎన్టీఆర్‌తో పాటు చిత్ర బృందానికి అభినందనలు తెలియజేశాడు.