రాజమౌళి కలిసి పనిచేద్దాం.. జేమ్స్ కామెరూన్ బంపరాఫర్
oscars, camaroon ఇటీవల అమెరికాలో జరిగిన ఓ అవార్డుల వేడుకలో రాజమౌళి.. హాలీవుడ్ దర్శక దిగ్గజం జేమ్స్ కామెరూన్‌ను కలుసుకున్న సంగతి తెలిసిందే. సుమారు పది నిమిషాల పాటు వారి మధ్య సంభాషణ కొనసాగింది. ఆ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. అయితే వారిద్దరూ ఏం మాట్లాడుకున్నారనే విషయంలో కొంత మేర రివీల్ అయినప్పటికీ కొంత మాత్రం సస్పెన్స్‌గానే ఉండి పోయింది. ఎట్టకేలకు రాజమౌళితో జేమ్స్ కామెరూన్ ఏం చెప్పారో ఆర్ఆర్ఆర్ టీం వెల్లడించింది. […]

oscars, camaroon
ఇటీవల అమెరికాలో జరిగిన ఓ అవార్డుల వేడుకలో రాజమౌళి.. హాలీవుడ్ దర్శక దిగ్గజం జేమ్స్ కామెరూన్‌ను కలుసుకున్న సంగతి తెలిసిందే. సుమారు పది నిమిషాల పాటు వారి మధ్య సంభాషణ కొనసాగింది. ఆ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి.
అయితే వారిద్దరూ ఏం మాట్లాడుకున్నారనే విషయంలో కొంత మేర రివీల్ అయినప్పటికీ కొంత మాత్రం సస్పెన్స్‌గానే ఉండి పోయింది. ఎట్టకేలకు రాజమౌళితో జేమ్స్ కామెరూన్ ఏం చెప్పారో ఆర్ఆర్ఆర్ టీం వెల్లడించింది. మీ టెర్మినేటర్, టైటానిక్, అవతార్ చిత్రాలన్నీ చూశాను. ఇవన్నీ నాకు స్ఫూర్తిని ఇచ్చాయి. మీ పని తీరుకి నేను వీరాభిమానిని అంటూ రాజమౌళి తనను తాను పరిచయం చేసుకున్నారు. వీరిద్దరి మధ్య ఆర్ఆర్ఆర్ సినిమా ప్రస్తావనకు వచ్చిది.
ఆర్ఆర్ఆర్ సినిమాను తాను రెండుసార్లు చూశానని జేమ్స్ కామెరూన్ రాజమౌళితో చెప్పారట. ఆర్ఆర్ఆర్ సినిమా బాగా నచ్చడంతో రెండోసారి తన భార్య సుజీతో కలిసి చూశాను అని కామెరూన్ రాజమౌళితో అంటున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఇందులో కామెరూన్ సతీమణి సుజీ మాట్లాడుతూ.. రెండోసారి నాకోసం ఆయన ఈ సినిమా చూశారు.
తెరపై ఏం జరగబోతుందో కామెరూన్ ముందే చెప్పేసే వారు అంటూ సుజీ కూడా రాజమౌళితో తన అనుభవాన్ని పంచుకుంది. అంతేకాదు కీరవాణి అందించిన నేపధ్య సంగీతాన్ని కూడా కామెరూన్ మెచ్చుకున్నారు. పాత్రలని నీరు, నిప్పులతో పోల్చటం, వాటికి ప్రతీకలుగా చూపించి పరిచయం చేసిన విధానం.. స్నేహం, వైరాన్ని చూపించిన సన్నివేశాలు వావ్ అనిపించేలా ఉన్నాయని.. ఫ్లాష్ బ్యాక్‌లోకి తీసుకెళ్లిన పద్ధతి సైతం జేమ్స్ కామెరూన్‌కి బాగా నచ్చినట్లుగా చెప్పుకొచ్చారు.
"If you ever wanna make a movie over here, let’s talk"- #JamesCameron to #SSRajamouli.