బీఎస్పీకి ఆరెస్ ప్రవీణ్‌కుమార్ రాజీనామా

బీఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆరెస్‌.ప్రవీణ్‌కుమార్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను శనివారం బీఎస్పీ అధినేత్రి మాయావతికి పంపించారు

బీఎస్పీకి ఆరెస్ ప్రవీణ్‌కుమార్ రాజీనామా
  • బీఆరెస్‌తో పొత్తు నిర్ణయం..ఆ వెంటనే రాజీనామా
  • నేడో రేపో బీఆరెస్‌లోకి
  • నాగర్ కర్నూల్‌లో బీఆరెస్ అభ్యర్థిగా పోటీ


విధాత: బీఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆరెస్‌.ప్రవీణ్‌కుమార్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను శనివారం బీఎసీ అధినేత్రి మాయావతికి పంపించారు. అనంతరం సోషల్ మీడియా వేదికగా తన రాజీనామాపై ఆరెస్పీ స్పందించారు. పొత్తు ఒప్పందంలో భాగంగా ఎన్ని ఒడిదుడుకులొచ్చినా ముందుకు సాగాల్సిందేనని, కష్టసుఖాలు పంచుకోవాల్సిందేనని, ఇదే నేను నమ్మిన నిజమైన ధర్మం అని ట్వీట్‌లో పేర్కోన్నారు.


నిన్న బీఎస్సీ- బీఆరెస్‌ పొత్తు వార్త బయటికి వచ్చిన వెంటనే బీజేపీ ఈ చారిత్రాత్మక పొత్తును భగ్నం చేయాలని విశ్వప్రయత్నాలు (కవిత అరెస్టుతో సహా) చేస్తున్నదని, బీజేపీ కుట్రలకు భయపడి నేను నమ్ముకున్న విలువలకు తిలోదకాలు ఇవ్వలేనని, నా ఈ ప్రస్థానాన్ని ఆపలేనని చెప్పుకున్నారు.


మళ్లీ చెబుతున్నానని, చివరి వరకు బహుజన వాదాన్ని నా గుండెలో పదిలంగా దాచుకుంటానని, బీఎస్పీ పార్టీకి రాజీనామా చేస్తున్నానని, ఈ నిర్ణయం బాధ అనిపించిన తప్పడం లేదని ట్వీట్ చేశారు. కాగా బీఎస్పీకి రాజీనామా చేసిన ప్రవీణ్‌కుమార్ నేడో రేపో బీఆరెస్‌లో చేరనున్నారు. నాగర్ కర్నూల్ బీఆరెస్ అభ్యర్థిగానే ప్రవీణ్‌కుమార్ పోటీ చేస్తారని సమాచారం.