యూఎన్‌ సోషల్‌ డెలవప్‌మెంట్‌ 62వ కమిషన్‌ చైర్‌పర్సన్‌గా రుచిరా కాంబోజ్‌

Ruchira Kamboj | ఐక్యరాజ్య సమితిలో (United Nations) భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్‌ (Ruchira Kamboj) సోషల్‌ డెవలప్‌మెంట్‌ కమిషన్‌ (Social Development Commission) చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. ఈ వారం న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో జరిగే సోషల్‌ డెవలప్‌మెంట్‌ కమిషన్‌ 62వ సమావేశానికి ఆమె అధ్యక్షత వహించనున్నారు. డొమినిక్‌ రిపబ్లిక్‌ నుంచి కార్లా మారియా, లక్సెంబర్గ్‌ నుంచి థామస్‌ లామర్స్‌ ఉపాధ్యక్షులుగా నియామకమయ్యారు. అంతకుముందు, సోషల్‌ డెవలప్‌మెంట్‌ కమిషన్‌.. 61వ సెక్షన్‌ […]

యూఎన్‌ సోషల్‌ డెలవప్‌మెంట్‌ 62వ కమిషన్‌ చైర్‌పర్సన్‌గా రుచిరా కాంబోజ్‌

Ruchira Kamboj | ఐక్యరాజ్య సమితిలో (United Nations) భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్‌ (Ruchira Kamboj) సోషల్‌ డెవలప్‌మెంట్‌ కమిషన్‌ (Social Development Commission) చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. ఈ వారం న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో జరిగే సోషల్‌ డెవలప్‌మెంట్‌ కమిషన్‌ 62వ సమావేశానికి ఆమె అధ్యక్షత వహించనున్నారు.

డొమినిక్‌ రిపబ్లిక్‌ నుంచి కార్లా మారియా, లక్సెంబర్గ్‌ నుంచి థామస్‌ లామర్స్‌ ఉపాధ్యక్షులుగా నియామకమయ్యారు. అంతకుముందు, సోషల్‌ డెవలప్‌మెంట్‌ కమిషన్‌.. 61వ సెక్షన్‌ చివరి సమావేశ సందర్భంగా ఆమోదం కోసం ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక మండలికి నాలుగు ముసాయిదా తీర్మానాలను పంపింది. కమిషన్ 61వ సెషన్‌కు ఖతార్ రాయబారి, శాశ్వత ప్రతినిధి అలియా అహ్మద్ బిన్ సైఫ్ అల్ థానీ అధ్యక్షత వహించారు.

ఏకగ్రీవంగా ఆమోదించాయిల్సిన ముసాయిదా ప్రతిపాదనలు, కొవిడ్‌ మహమ్మారి తర్వాత సాధారణ స్థితిని పునరుద్ధరించడంపై అసమానతలు, ఒత్తిడిని తొలగించేందుకు పూర్తి ఉపాధిని సృష్టించడం తదితర తీర్మానాలను పంపింది. ఇదిలా ఉండగా.. సామాజిక అభివృద్ధి కమిషన్‌ 62వ సెషన్‌కు చైర్‌పర్సన్‌గా ఎంపికడంపై రుచిరా కాంబోజ్‌ హర్షం వ్యక్తం చేశారు. భారత్‌ తరఫున ఎన్నికకావడం గౌరవంగా భావిస్తున్నానన్నారు. ఈ సందర్భంగా భారత్‌ తరఫున కృతజ్ఞతలు తెలిపారు.