Sai Dharam Tej: ఆ అమ్మాయి వ‌ల‌న సూసైడ్ చేసుకోవాల‌నుకున్న సాయిధ‌ర‌మ్ తేజ్..షాకింగ్ కామెంట్స్ వైర‌ల్

Sai Dharam Tej: పెద్ద ప్ర‌మాదం నుండి బ‌య‌ట‌ప‌డ్డ సాయిధ‌ర‌మ్ తేజ్ ఇప్పుడు వ‌రుస సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. ఆయ‌న న‌టించిన రీసెంట్ మూవీ విరూపాక్ష చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పెద్ద విజ‌యం సాధించింది.ఇదే ఉత్సాహంతో త‌న మావ‌య్య ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో క‌లిసి బ్రో అనే సినిమా చేశాడు. ఈ చిత్రం త‌మిళ సూప‌ర్ హిట్ వినోద‌య సీతంకి రీమేక్‌గా రూపొందింది. చిత్రంలో సాయి ధరమ్ తేజ సరసన కేతిక శర్మ హీరోయిన్‌గా న‌టించ‌గా, […]

  • By: sn    latest    Jul 24, 2023 7:44 AM IST
Sai Dharam Tej: ఆ అమ్మాయి వ‌ల‌న సూసైడ్ చేసుకోవాల‌నుకున్న సాయిధ‌ర‌మ్ తేజ్..షాకింగ్ కామెంట్స్ వైర‌ల్

Sai Dharam Tej: పెద్ద ప్ర‌మాదం నుండి బ‌య‌ట‌ప‌డ్డ సాయిధ‌ర‌మ్ తేజ్ ఇప్పుడు వ‌రుస సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. ఆయ‌న న‌టించిన రీసెంట్ మూవీ విరూపాక్ష చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పెద్ద విజ‌యం సాధించింది.ఇదే ఉత్సాహంతో త‌న మావ‌య్య ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో క‌లిసి బ్రో అనే సినిమా చేశాడు. ఈ చిత్రం త‌మిళ సూప‌ర్ హిట్ వినోద‌య సీతంకి రీమేక్‌గా రూపొందింది. చిత్రంలో సాయి ధరమ్ తేజ సరసన కేతిక శర్మ హీరోయిన్‌గా న‌టించ‌గా, మ‌రో ముఖ్య పాత్ర‌లో ప్రియా ప్రకాష్ వారియర్ న‌టించింది. ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్, టీజర్, పోస్టర్ లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన రావ‌డంతో మూవీ మంచి హిట్ అవుతుంద‌ని ప్ర‌తి ఒక్క‌రు భావిస్తున్నారు.

ప‌వన్ క‌ళ్యాణ్ రాజకీయాల‌తో బిజీగా ఉండ‌డం వ‌ల‌న సాయి ధ‌ర‌మ్ తేజ్ చిత్ర ప్ర‌మోష‌న్ బాధ్య‌త‌ల‌ని త‌న‌పైన వేసుకున్నారు. కొద్ది రోజులుగా ప‌లు ఇంట‌ర్వ్యూలు ఇస్తూ సినిమాపై ఆస‌క్తి పెంచే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. జూలై 28న విడుద‌ల కానున్న ఈ చిత్రంకి సంబంధించి ఓ వార్త నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేసింది. చిత్రం క్లైమాక్స్ లో సాయి ధరమ్ తేజ్ సూసైడ్ చేసుకోబోతున్నాడట. ఇంట్లోని స‌మ‌స్యలు ..లవ్ ఫెయిల్యూర్..ఇలా అన్ని బాధలు తట్టుకోలేక సాయి ధరమ్ తేజ్ సూసైడ్ చేసుకోవాలి అని డిసైడ్ కాగా, అప్పుడు పవన్ దేవుడిలా వ‌చ్చి కధను మలుపు తిప్పబోతున్నాడ‌ని టాక్.

అయితే సినిమాలో మాదిరిగానే రియ‌ల్ లైఫ్‌లో కూడా సాయి ధ‌ర‌మ్ తేజ్ సూసైడ్ చేసుకున్నాడ‌ట‌. ఈ విష‌యాన్ని ఆయ‌న రీసెంట్‌గా ఓ ఇంట‌ర్వ్యూలో తెలియ‌జేశాడు. తాను చదువుకునే రోజుల్లో చాలా మంది యూత్ లాగే ఓ అమ్మాయిని బాగా ఇష్టపడ్డారట. అయితే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకోగా, ఆ అమ్మాయికి వేరు పెళ్లి అయింద‌ట‌. ఈ విష‌యం తెలుసుకున్న సాయిధ‌ర‌మ్ తేజ్ ఆ అమ్మాయిని మ‌ర‌చిపోలేక సూసైడ్ చేసుకోవాల‌ని అనుకున్నార‌ట‌. అప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌
జోక్యం చేసుకోని తేజూని మాములు మ‌నిషిని చేశాడట‌. ఇక అనంత‌రం తేజూ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి రాణిస్తున్నారు. త్వ‌ర‌లో తేజూ కూడా మంచి అమ్మాయిని వివాహం చేసుకోబోతున్న‌ట్టు తెలుస్తుంది.